Switch to English

చిరంజీవి చేసిందేంటో ఇప్పుడు చెబుతున్నారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

తెలుగు గడ్డపై సొంతంగా పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన దివంగత ఎన్టీఆర్ తరహాలోనే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్ ను ఓట్ల రూపంలో మలుచుకుని సీఎం కావాలనుకున్నారు. కానీ మీడియా అండ లేకపోవడం, నమ్మినవారే నట్టేట ముంచడం వంటి సవాలక్ష కారణాలతో కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు.

తర్వాతి పరిణామాలతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, వారు అందుకు ప్రతిగా వారిచ్చిన రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి చెంది ఆనక రాజకీయాలనే వదిలేశారు. స్వతహాగా మృదు స్వభావి అయిన చిరంజీవి రాజకీయాల్లో తనకు ఎదురైన భయంకర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇక వాటి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు వైరి పక్షాలకు చెందిన నేతలు ఎన్నో విమర్శలు గుప్పించారు. చిరంజీవి రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఆరోపణలు చేశారు. అయితే, ఇప్పుడిప్పుడే చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండగా చేసిన పనులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి కూడా అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు పోటీపడి మరీ చెబుతుండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లో మెగా టూరిజం సర్క్యూట్ కోసం చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇటీవల వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం చిరంజీవి రూ.వంద కోట్లు విడుదల చేశారని టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తర్వాత అధికార పార్టీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చిరంజీవి చేసిన అభివృద్ధి పనులు ప్రస్తావించారు. గతంలో భీమిలి అభివృద్ధి కోసం రూ.50 కోట్లు విడుదల చేశారని వివరించారు.

అయితే, చిరంజీవి అలా నిధులు విడుదల చేయించినా.. తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ వాటిని ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి చేసిందేమీ లేదంటూ విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీడియా అండ లేకపోవడం అన్న ఒకే ఒక్క కారణంగా చిరంజీవి చేసిన పనులు బయటకు రాలేదని, దురదృష్టం ఆయన్ను అలా కూడా వెంటాడిందని సానుభూతి కనబరుస్తున్నారు. ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలియడమంటే ఇదేనని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

Viral News: భారతీయుడి పేరుతో వెటకారం.. 10వేల డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ

Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి...

Chiranjeevi: జనసేనానికి చిరంజీవి ఆశీర్వాదం.. పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళం

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును పవన్...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

Hyper Adi: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు: హైప్ ఆది

Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan...