Chiranjeevi Birthday Special: చిరంజీవి సినిమాలో ఈ క్లైమాక్స్ అసలు ఊహించనిది..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,403FansLike
57,764FollowersFollow

Chiranjeevi Birthday Special: సినిమాకు క్లైమాక్స్ చాలా కీలకం. ప్రారంభం నుంచి రక్తి కట్టించే సినిమా ముగింపు ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. తెలుగు సినిమాలు హ్యాపీ ఎండింగ్ తోనే ఉండాలి. కొన్ని సినిమాల్లో క్లైమాక్స్ లో నటీనటుల పెర్ఫార్మెన్స్ మరీ కీలకం. కొన్నిసార్లు సినిమా టాక్ కు కీలకం అవుతాయి కూడా. అలా ఆర్ధృత కలిగిన సినిమాలు కమర్షియల్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవికీ ఉన్నాయి. తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’లోనే అటువంటి క్లైమాక్స్ చూడొచ్చు. తాయారమ్మ బంగారయ్య, కుక్కకాటుకు చెప్పుదెబ్బ వంటి సినిమాల్లో విలనిజంతో తనలోని నటనను మరో కోణంలో ఆవిష్కరించారు. ‘పున్నమినాగు’లో చిరంజీవిని.. పారిపో అని హీరో అంటే.. ‘ఎక్కడికని పోవాలి.. పోతే పుట్టలోకే పోవాల’ని చిరంజీవి చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్ని కంటనీరే తెప్పిస్తుంది. అంతలా పాత్రకి ప్రాణం పోశారు చిరంజీవి.

చిరంజీవి నటనను, సినిమా స్థాయిని మరింత పెంచిన సినిమా రుద్రవీణ. సినిమాలో చిరంజీవి పాత్ర అణగారిన వర్గాలు కూడా సాటి మనుషులే.. అందరూ సమానమని నమ్మే వ్యక్తి. వారి కోసం ఊరి బాగు కోసం శ్రమించే సూర్యం పాత్రలో నటించారు చిరంజీవి. తండ్రి-కొడుకుల మధ్య సంఘర్షణలో చివరికి చిరంజీవి ఊరి కోసం శ్రమించి దేశ ప్రధాని స్థాయిలో గౌరవం తెచ్చుకోవడం.. నేను ‘సూర్యం తండ్రిని’ అని చెప్పుకునే క్లైమాక్స్ సినిమాకు హైలైట్. అప్పటికే చిరంజీవితో పలు సినిమాలు చేసిన చిత్ర దర్శకుడు కె.బాలచందర్.. ‘రజినీకాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి’ అనేలా చేసింది. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ కూడా చిరంజీవి నటనలోని పలు వేరియేషన్స్ చూపిస్తుంది. పులిరాజు పాత్రలో చిరంజీవి ఆవేశం మాత్రమే కాదు.. ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా క్లైమాక్స్ లో నటన అద్భుతం.

చిరంజీవి నటించిన మరో అద్భుతమైన పాత్ర ‘ఆపద్భాందవుడు’లో మాధవ పాత్ర. గోవుల కాపరిగా.. అనాధగా తనను చేరదీసిన కుటుంబానికి విధేయుడిగా ఉండే పాత్రలో నటించారు. ముఖ్యంగా కథలోని తీవ్రమైన భావోద్వేగాల మధ్య క్లైమాక్స్ లో చిరంజీవి నటన ప్రతి ప్రేక్షకుడికి కంటనీరే తెప్పిస్తుంది. తనను ప్రేమించిన అమ్మాయిని తీవ్ర సంఘర్షణతో స్వీకరించే క్లైమాక్స్ మనసుల్ని చలింపజేస్తుంది. స్వాతంత్ర సమరయోధుడిగా చిరంజీవి నటించిన ‘సైరా..’ మూవీలో క్లైమాక్స్ చిరంజీవి కెరీర్లోనే పీక్స్ అని చెప్పాలి. ఉరికొయ్యపై నుంచున్నా చెదరని ఆత్మవిశ్వాసం చూపిస్తూ కళ్లతోనే చిరంజీవి నటన నభూతో..! సినిమాలో చిరంజీవి పాత్ర ముగిసినా ప్రేక్షకులు స్వీకరించారంటే ఎంతటి పట్టున్న క్లైమాక్స్ అర్ధం చేసుకోవాల్సిందే. ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయడమే కాదు కంటనీరు తెప్పించిన క్లైమాక్స్ ఇది.

సినిమా

“మన విజయాల వెనక అమ్మే శక్తి”.. మదర్స్ డే సందర్భంగా చిరంజీవి...

మెగాస్టార్ Chiranjeevi మదర్స్ డే సందర్భంగా చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఎంతో హృద్యంగా...

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్...

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్...

“కృష్ణ” రీ-రిలీజ్‌కు షాక్.. బుకింగ్స్ లేక విడుదలే రద్దు!

మాస్ మహారాజా Ravi Teja కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో Krishna ఒకటి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2008లో...

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్...

రాజకీయం

సింగపూర్‌తో ఏపీకి కొత్త వాణిజ్య కారిడార్?.. లోకేష్ కీలక ప్రతిపాదనలు

సింగపూర్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో గ్లోరియా ఊతో ఆయన...

బీజేపీకి మద్దతిస్తా.. కానీ అలాంటి వారికాదు!: రష్మీ గౌతమ్

బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

“మోదీ-నారా కుటుంబ ఆత్మీయ భేటీ.. గంటసేపు సాగిన ప్రత్యేక సంభాషణలు”

భారత ప్రధానమంత్రి Narendra Modi హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నివాసానికి స్వయంగా వెళ్లి గంటకు పైగా గడపడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది....

“ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. మీ సేవలు సమాజానికి ఇంకా కావాలి”: పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ సూచనలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆరోగ్యంపై గౌరవ ప్రధానమంత్రి Narendra Modi ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ, ఆయన...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కన్య వారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

మే 11 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో మంచి మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి....

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర సినీ తారలు కూడా రాజకీయాల్లోకి వస్తారా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...