Chiranjeevi birthday special: మూలాలు మరువని ‘చిరంజీవి’.. ఉదాహరణలెన్నో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,529FansLike
57,764FollowersFollow

Chiranjeevi: ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు కొందరు.. జీవితంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులు మరొకరు చూడొద్దు అనుకుంటారు మరికొందరు.. సంపాదనలో కొంత ఇతరులకు సాయం చేయాలనే మనస్తత్వం కొందరిది.. తమతోపాటే ప్రయాణించిన వారు అవసరాల్లో ఉంటే ఆదుకుంటారు మరికొందరు.. ఉన్నత స్థానానికి వెళ్లినా మూలాల్ని మరువని వారు ఇంకొందరు. వారిలో చిరంజీవి ప్రధమ వరుసలో ఉంటారు. సాధారణంగా మొదలై.. మహోన్నత స్థితికి వెళ్లారు సినీ రంగంలో. మధ్యతరగతి మనస్తత్వాలు, జీవితాలు చాలా దగ్గరగా బాల్యంలోనే చూసిన చిరంజీవి ఆ మూలాల్ని మరువలేదు. కుటుంబాన్ని పైకీ తీసుకొచ్చారు. తన చుట్టూ ఉన్నవారిని ఆదుకున్నారు. ఫ్యాన్స్ అభిమానాన్ని సేవా మార్గం వైపు మళ్లించారు. వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.. నిరంతరంగా కొనసాగిస్తున్నారు.

తనతో ఫిల్మ్ కోర్స్ చేసిన స్నేహితులకు సినిమా చేశారు. ఆర్ధికంగా నిలబెట్టారు. అప్పటికి ఎన్నో చిన్న సినిమాలకు సంగీతం అందించిన అప్పటి యువ ద్వయం రాజ్-కోటికి అవకాశం ఇచ్చి.. ఒక్క సినిమాతోనే వారు టాప్ పొజిషన్ కు వెళ్లేలా ప్రోత్సహించారు. తెలుగు సినిమా కామెడీకి వన్నెలద్దిన బ్రహ్మానందం టాలెంట్ ను బాగా ప్రోత్సహించారు. తన హాస్యాన్ని తొలినాళ్లలోనే చిరంజీవి ఎక్కువగా ఇష్టపడేవారని బ్రహ్మానందం ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు. తోటి ఇనిస్టిట్యూట్ విద్యార్ధి, ప్రముఖ నటుడు నాజర్ కు సైతం కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి ప్రోత్సాహం అందించేవారు. తమిళ నటుడు పొన్నాంబళంకు రూ.40లక్షల వ్యయం అయ్యే వైద్య చికిత్స అందించి ఆయనకు ఊపిరి పోశారు.

ప్రత్యక్షంగా ఎందరిని ఆదరించారో.. పరోక్షంగా అందరిపై ప్రభావం చూపారు చిరంజీవి. నటుడిగానే కాకుండా సేవా మార్గంలోనూ తనదైన ప్రత్యేక దారిలోనే వెళ్లారు. దేశంలో మరే హీరో చేయని విధంగా అభిమానులనే సేవా మార్గంలో నడిచేలా చేశారు. దశాబ్దాలుగా అభిమానులు ఆయన బాటలోనే నడుస్తూండటం విశేషం. ఎందరో అభిమానులను ఆర్ధికంగా కూడా ఆదుకున్నారు. శుభకార్యాలకైనా.. వైద్య ఖర్చులకైనా అభిమానులను తనవారిగానే చూడటం చిరంజీవి నైజం. మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తిగా మూలాల్ని మరువక.. తన ఆలోచనలను అలానే ఉంచుకోవడం చిరంజీవి స్థితప్రజ్ఞతకు నిదర్శనం. అందుకు హీరోగానే కాదు.. ఆయన వ్యక్తిత్వానికీ అభిమానం దక్కింది.

729 COMMENTS

సినిమా

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల...

రాజకీయం

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఎక్కువ చదివినవి

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో స్టార్ హీరో అయితే ఒక సినిమాకు...

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. తుల రాశివారికి కొత్త పరిచయాలతో ప్రయోజనం!

మే 13 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు...

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...