Chiranjeevi: ఆగష్టు నెల.. మెగాభిమానులకు పండగ వేళ. ఆగష్టు 22 కోసం ఎదురుచూపులు. ఆరోజు తెలుగు సినిమా రారాజు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఒకటో తేదీ నుంచి 22 వరకూ రోజుకో సంబరం. జనరేషన్స్ మారినా మెగాస్టార్ క్రేజ్, ఇమేజ్ స్థాయి ఎవరెస్ట్ శిఖరం. అభిమానుల్లో కూడా దశాబ్దాలుగా అదే అభిమానం. 45ఏళ్ల కెరీర్.. 155 సినిమాలు.. తన నటన, డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో అశేష తెలుగు ప్రేక్షకుల్ని వెండితెరపై అలరించి, మంత్రముగ్దుల్ని చేశారాయన.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, కొత్త తరాన్ని ప్రోత్సహించడం, కుటుంబ విలువలు పాటించడం. సేవ, దాతృత్వం.. చిరంజీవిలోని సుగుణాలు. హీరోగానే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఆయన ఎందరికో ఆదర్శం. తాను తెలుగు సినీ పరిశ్రమ పెద్దను కాదు.. తెలుగు సినీ కళామతల్లి బిడ్డను అని చెప్పుకునే నిగర్వి. అందుకే ఆయన మెగాస్టార్. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి 22వరకూ చిరంజీవిపై ‘టీమ్ తెలుగు బులెటిన్’ రోజుకో వార్త ఇవ్వబోతోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ..👍
