మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆచార్య నుండి ప్రత్యేకమైన అప్డేట్ వస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆచార్య నుండి చిరు బర్త్ డే పోస్టర్ ను సింపుల్ గా వదిలారు. గతంలో వదిలిన లుక్ నుండే మరో పోస్టర్ ను మెగా ఫ్యాన్స్ కోసం వదిలారు.
పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే చిరంజీవి అంటూ వేశారు. కాని సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సినిమాకు సంబంధించినంత వరకు విడుదల తేదీ దసరా లేదా వచ్చే సంక్రాంతి అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడితే ఆ తేదీని ఆక్రమించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతలోనే సంక్రాంతి సీజన్ బరిలో చిరంజీవి ఆచార్య కూడా జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆచార్య నుండి మరింత క్లారిటీని అభిమానులు చిరు బర్త్ డే సందర్బంగా ఆశిస్తున్నారు.
342527 978318Some genuinely fantastic weblog posts on this internet internet site , regards for contribution. 826385