దాదాపు పదేళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన 100 కోట్ల పైన షేర్ సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి తానే మెగాస్టార్నని మరోమారు నిరూపించుకున్న చిరంజీవి, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ దిశగా అడుగులు వేసిన విషయం విదితమే. బాలీవుడ్‌లోనూ, ఇతర భాషల్లోనూ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగునాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు, నిర్మాణపు ఖర్చు.. వీటిపై భిన్న వాదనలు వున్నా, సినిమా పట్ల చిరంజీవి చూపిన కమిట్మెంట్, డెడికేషన్.. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి చూపేందుకు చిరంజీవి సహా చరణ్ పడ్డ కష్టం.. ఇవన్నీ ఆ సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాయి. ఇక, ఇప్పుడు చిరంజీవి తన ట్రేడ్ మార్క్ కమర్షియల్ సినిమా.. విత్ మెసేజ్.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. అదే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా.
ప్రస్తుతం ప్రచారంలో వున్న గాసిప్స్‌ని బట్టి చూస్తే, ఈ సినిమాకి 150 కోట్ల వరకూ బడ్జెట్ అనుకుంటున్నారట. మరోపక్క చిరంజీవికి 50 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి, చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత.? అనే విషయమై భిన్న వాదనలు వున్నాయి. ఫలానా సినిమాకి చిరంజీవి ఎంత తీసుకున్నారు.? అనే లెక్కలు.. ఇప్పటివి కాదు, ఎప్పటినుంచో వున్నవే.
టాలీవుడ్లో మిగతా హీరోలది ఓ లెక్క, చిరంజీవిది ఇంకో లెక్క. సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌ని బట్టి, పోస్ట్ రిలీజ్ బిజినెస్‌ని బట్టి అంచనాలకు మించి పెరిగిపోతుందనే అభిప్రాయం సినీ పరిశ్రమలో చాలాకాలంగా వుంది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. అసలు, నెంబర్ల పొజిషన్ గురించీ.. రెమ్యునరేషన్ గురించీ.. మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిరంజీవి ప్రస్తావన ఎందుకు.? ఆయన అన్ డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ టాలీవుడ్. ఆయన తర్వాతే ఏదైనా.! ఈ విషయాన్ని గతంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు స్వయంగా కుండబద్దలుగొట్టేశాడు.
సో, నాన్ చిరంజీవి.. అంటూ నెంబర్ల పొజిషన్ గురించి చర్చించుకోవడం కరెక్టేమో.. అది రెమ్యునరేషన్ అయినా.. సినిమా విజయాల విషయం అయినా.!
630828 141379 You really should take part in a contest for one of the finest blogs on the internet. I will recommend this internet site! 646576
361498 952130This internet site is my aspiration, quite superb design and Perfect articles. 296328