మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల లాగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇంకో నెల తర్వాత ప్రారంభం అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ రోజు ఈ మెగా157వ మూవీ షూటింగ్ ను సైలెంట్ గా హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారని తెలుస్తోంది.
కానీ ఈ విషయాన్ని బయటకు ప్రకటించలేదు. వచ్చే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ గానే ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు. ఆమె అనౌన్స్ మెంట్ కూడా డిఫరెంట్ వీడియోతో చేశారు. మున్ముందు మరింత మంది నటులను తీసుకుంటారని తెలుస్తోంది. వారి ప్రకటనలు కూడా ఇలాగే డిఫరెంట్ కాన్సెప్టులతో చేయబోతున్నాడంట అనిల్ రావిపూడి. అసలే ప్రమోషన్లు చేయడంలో అనిల్ రావిపూడి స్పెషల్. సినిమా అయిపోయిన తర్వాత కాకుండా ముందు నుంచే మూవీపై హైప్ ఎలా తీసుకురావాలో అతనికి బాగా తెలుసు. అదే ఈ మూవీకి కూడా ఫాలో అవుతున్నాడంట.
