Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి టెంపుల్ సెట్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే ఓ శాంపిల్ వీడియోని పోస్ట్ చేసి ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఆ అద్భుతమైన సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్. కొరటాల శివ భరత్ అనే నేను సినిమాకి వర్క్ చేసిన సురేష్ గతంలో హిందీ ‘బ్రదర్స్’ సినిమాకి, తమిళ్ లో ఇంకొక్కడు, పేట సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. మేము ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ముచ్చటించి తెలుసుకున్న ఆచార్య మూవీ విశేషాలు మీకోసం..

చిరు గారు షేర్ చేసిన టెంపుల్ సెట్ కి విశేష స్పందన లభించింది. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి??

చిరు గారు నా ఫోటో పెట్టి, సెట్ గురించి ట్వీట్ చేసి, నా గురించి అంతలా చెప్పడం ఓ అద్భుతమైన అనుభవం. రాత్రికి రాత్రి నన్ను టాక్ ఆఫ్ ది టౌన్ చేసేసారు. చిరు గారు లెజెండ్, ఆయన అలా చెప్పడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది అనిపించింది. నాకు తెలుగులో ఇది రెండవ సినిమా కానీ ఒక 40 – 50 సినిమాలు చేసిన గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ కి దక్కిన గౌరవం లభించింది. చిరు గారు, చరణ్ గారు సోషల్ మీడియాలోనే కాదు ప్రతి రోజూ సెట్లో నా వర్క్ ని పొగిడేవారు, వారి పాజిటివ్ ఎనర్జీ నన్ను ఇంకా ఎనర్జీతో పనిచేసేలా చేసింది.

ధర్మస్థలి టెంపుల్ సెట్ బడ్జెట్ ఎంత అండ్ ఆ సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది?

టెంపుల్ సెట్ బడ్జెట్ ఓవరాల్ గా ఇంత అయ్యింది అనే నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ 20 కోట్ల పైనే అయ్యిందని చెప్పగలను. మిగతా చిన్న చిన్న సెట్స్, వేరే సెట్ ప్రాపర్టీస్ ని కూడా కలుపుకుంటే 25 కోట్లు సెట్స్ వరకే అయ్యింది. అలాగే ఆ టెంపుల్ సెట్ వెయ్యడానికి మూడున్నర నెలల సమయం పట్టింది.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం. ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

అంత బడ్జెట్ పెట్టి చేసిన ఆ సెట్ లో ఎంత పెర్సెంట్ సినిమా జరుగుతుంది?

సుమారు 60% ఆ సినిమా సెట్లోనే జరుగుతుంది. మిగతా 40% వేరే సెట్స్ మరియు వేరే లొకేషన్స్ లో జరుగుతుంది.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

ఇంత బడ్జెట్ సెట్ వేయడంలో నిర్మాతల సపోర్ట్ ఎలా ఉంది?

నిర్మాతలు నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ గార్లకి నా బిగ్గెస్ట్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపొయింది, ఎలాంటి సెట్ కావాలన్నా సిజి వర్క్ కి వెళ్లిపోతున్న టైంలో 20 ఎకరాల ప్లేస్ లో, సుమారు 25 కోట్ల వ్యయంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ టెంపుల్ సెట్ ని వేసే అవకాశం నాకు కల్పించినందుకు వారికి బిగ్గెస్ట్ థాంక్స్. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సెట్ పూర్తయ్యేది కాదు. అలాగే కొరటాల శివ గారి విజన్ అండ్ అవకాశం వలనే ఇది సాధ్యమైంది.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం. ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

‘ఆచార్య’లో మీ వర్క్ నచ్చి చిరు గారు మీకు ఇంకో సినిమా ఆఫర్ చేశారట?

అవునండి.. చిరు గారి నెక్స్ట్ ఫిల్మ్ లూసిఫర్ రీమేక్ కి కూడా నేనే ఆర్ట్ వర్క్ చేస్తున్నాను. చిరు గారు ఇచ్చిన అవకాశం నాకు ఓ గొప్ప అవార్డుతో సమానం.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

చిరు అండ్ చరణ్ లతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది.

చిరు లానే చరణ్ గారు కూడా సెట్లో వర్క్ ని ఎంతో మెచ్చుకునేవారు. అలాగే చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు. టెక్నిషియన్ కి వాళ్ళు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ మాములుగా ఉండదు. రామ్ చరణ్ – చిరు కాంబినేషన్ స్క్రీన్ మీద మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటది, ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ప్రస్తుతానికి అంతకన్నా ఎక్కువ చెప్పలేను.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

ఆచార్య సెట్ చూసాక మీకు తెలుగు సినిమా ఆఫర్స్ ఎక్కువ వస్తుండాలి. వేరే ఏదైనా సినిమాలు కమిట్ అయ్యారా? అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఆచార్య తర్వాత అవకాశాలు వస్తున్నాయి, కానీ నేను ముంబై బేస్డ్ ఆర్ట్ డైరెక్టర్, అలాగే హిందీ, తమిళ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నాను కాబట్టి నా డేట్స్ ని బట్టి, అన్ని లాంగ్వేజెస్ బాలన్స్ చేసేలా తెలుగులో ప్రాజెక్ట్స్ సైన్ చేస్తాను. ప్రస్తుతానికి తెలుగులో చిరు గారి లూసిఫర్ రీమేక్, హిందీలో అల వైకుంఠపురములో రీమేక్ కి వర్క్ చేస్తున్నాను.

ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ – చిరు గారి నుంచి మరో అవకాశం గొప్ప అవార్డుతో సమానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

డీజే టిల్లు2లో ఈ మల్లు బ్యూటీ?

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

‘తల్లిని మించిన యోధురాలు లేదు..’ విష సర్పం నుంచి బాలుడిని కాపాడుకున్న తల్లి

‘తల్లిని మించిన యోధురాలు భూమి మీద లేదు’ అని కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దీనిని నిజం చేస్తూ కన్నబిడ్డపై తల్లి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కర్ణాటకలోని మాండ్యలో...