Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం అందుకున్న మొదటి భారతీయ సినీ హీరోగా చిరంజీవి కీర్తి గడించారు. బ్రిడ్జి ఇండియా సంస్థ కూడా చిరంజీవిని జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించి గౌరవించింది.
కార్యక్రమం అనంతరం స్థానిక మెగాభిమానులతో చిరంజీవి సమావేశమయ్యారు. వారితో కలిసి ముచ్చటించి మాట్లాడారు. ‘మీరంతా నా తమ్ముళ్లు, చెల్లెళ్లే. మీ అభిమానం చూస్తుంటే ఇంకా ముచ్చటేస్తోంది. జీవితంలో మీరేం సాధించినా నేను సాధించినట్టే. మీరు నా సినిమా, లేదంటే నా మాట వినో మీరంతా నన్ను అభిమానిస్తున్నారు’.
‘మీరంతా నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇది నాకెంతో సంతోషాన్నిస్తోంది. జీవితంలో నాకు ఇంకేం కావాలి. ఏం ఆలోచించకుండా నా మనసులో ఉన్నదే మాట్లాడేస్తున్నా. మీ అందరి ఇళ్లకు వచ్చి చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది. భవిష్యత్తులో అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా’నని అన్నారు.