Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ‘పుష్ప’ కు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా మరో ఐదు రోజుల్లో ధియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాలో జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ ప్రోమో ఇప్పటికే అలరించింది. ఇప్పుడిదే వెర్షన్ ను చతుర్ అనే పిల్లాడు.. కొంతమంది చిన్నారులతో కలిసి జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ మాదిరే తయారై చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తరహాలోనే నటించి ఆకట్టుకున్నాడు. దీనిని మైత్రీ మూవీస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
సంతోష్ ముత్యాల అనే యువకుడి పర్యవేక్షణలో చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చతుర్ చక్కగా నటించాడని.. బాగా తెరకెక్కించారని సంతోష్ ను మెచ్చుకుంటున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12వేల ధియేటర్లలో విడుదలవుతోంది పుష్ప 2. 4వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.