Chhaava: విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’. బాక్సాఫీస్ వద్ద సినిమా ఘన విజయం సాధించింది. సినిమా చూసి ప్రేక్షకులు భావోద్వేగమవుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో నాగ్ పూర్ లోని ధియేటర్లో ఓ అభిమాని సెలబ్రేట్ చేసేకున్న వీడియో వైరల్ అవుతోంది.
సినిమా పూర్తయ్యాక ధియేటర్లోకి గుర్రంపై శంభాజీ వేషంలో తెర ముందుకు రావడంతో ప్రేక్షకులు ‘జై శంభాజీ మహారాజ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరోవైపు.. సినిమా విజయంపై, ప్రేక్షకుల స్పందనపై విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా చూసిన ఓ చిన్నారి ‘శంభాజీ మహారాజ్ కు జై.. జై భవానీ’ నినాదాలు చేస్తున్న తీరు వైరల్ కావడంతోపాటు.. అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. వీడియోపై విక్కీ ఇన్ స్టా వేదికగా పంచుకుని స్పందించారు. ‘ఇదీ మేము సంపాదించుకున్న నిజమైన గౌరవం. మేం అక్కడే ఉండుంటే చిన్నారిని హత్తుకునేవాడిన’ని అన్నారు.