Switch to English

కరోనా థర్డ్ వేవ్: ఇంటికో చావు.. నిజమేనా.? భయపెట్టి చంపేస్తున్నాడా.?

మల్లిక్ పరుచూరి.. కెమికల్ ఇంజనీర్ అట. ఈ మధ్య పలు న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో డాక్టర్లతోపాటు కనిపిస్తున్నాడు.. కరోనా వైరస్ నేపథ్యంలో తన అభిప్రాయాల్ని పంచుకుంటున్నాడు. డాక్టర్ల మీద కూడా విరుచుకుపడిపోతున్నాడు.

కొన్నాళ్ళ క్రితం నిమ్స్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు, ప్రొఫెసర్ కూడా అయిన శ్రీభూషన్ రాజుతో కలిసి ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మల్లిక్ పరుచూరి, ప్లాస్మా థెరపీ కారణంగానే కరోనా వైరస్ మ్యుటేషన్లు పెరిగిపోయి, అది అత్యంత ప్రమాదకర స్థాయికి బలోపేతమయ్యిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరీ అంతలా భయపెట్టాల్సిన అవసరం లేదంటూ డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఎంతలా పరిస్థితిని వివరించి చెప్పినా, మల్లిక్ పరుచూరి మాత్రం అస్సలు తగ్గలేదు.

తాజాగా మరో ఛానల్ చర్చా కార్యక్రమంలో ఈ మేధావి మాట్లాడుతూ, కరోనా మొదటి వేవ్.. ఎక్కడో చావుల గురించి మనకి తెలియజేస్తే.. రెండో వేవ్.. మన సన్నిహితుల్లో చాలామంది చావుల్ని మనకి పరిచయం చేసింది.. మూడో వేవ్ మాత్రం మనింట్లోనే మనకి చావుని పరిచయం చేస్తుంది.. అంటూ భయంకరమైన వ్యాఖ్యల్ని చేశాడు.

మల్లిక్ పరుచూరి చెప్పినట్లే సెకెండ్ వేవ్ చాలామందిని భయపెట్టింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తోంది గనుక, కరోనా థర్డ్ వేవ్ మరీ అంత తీవ్రంగా వుండకపోవచ్చు. చిత్రమేంటంటే, వ్యాక్సిన్.. కరోనా వైరస్‌ని అడ్డుకోలేదని మల్లిక్ పరుచూరి అంటున్నాడు. అసలు అలా చెప్పడానికి ఆయన దగ్గర వున్న శాస్త్రీయ ఆధారాలేంటి.? ఇలాంటోళ్ళని మీడియా ఎందుకు చర్చా కార్యక్రమాలకు పిలిచి జనాన్ని భయపెడుతోంది.? ఈ విషయమై ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి.

అతని వద్దనున్న సమాచారాన్ని సేకరించి, అతను భయపెట్టేందుకోసమే తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాలి. సమాచారం నిజమైనదే అయితే, ప్రజల్ని అప్రమత్తం చేయాలి. నిజానికి, కరోనా సోకినవాళ్ళలో చాలామంది భయం కారణంగానే చనిపోతున్నారన్నది పలువురు వైద్య నిపుణులు చెబుతున్నమాట. భయపడాల్సిన విషయమే.. కానీ, ధైర్యంతో ఎదుర్కోవడం కూడా ముఖ్యమే.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

కాషాయ కండువా కప్పుకున్న ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంఛనం పూర్తయింది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ...

ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, 'పిజ్జా', 'పేట' సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'జగమే తందిరం'. ఈ సినిమాని తెలుగులో 'జగమే తంత్రం'గా డబ్ చేశారు. కరోనా...

శంకర్‌, వడివేలు వివాదం ముగిసింది

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ నిర్మాణంలో వడివేలు హీరోగా రూపొందిన సినిమా హింసించే 23వ రాజు పులకేసి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకంఉది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌ గా వడివేలు...

కోవిడ్ వ్యాక్సిన్ కు అయిస్కాంత శక్తులు లేవు: కేంద్రం

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమలో అయిస్కాంత లక్షణాలు వస్తున్నాయని ఇటివల కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటివలే నాసిక్ కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తి తనలో అయిస్కాంత...

7 మామిడికాయలకు 4గురు వ్యక్తులు, 6కుక్కలు కాపలా..! ఎందుకంటే..

సంక్రాంతి వచ్చిందంటే మామిడి పూతని చూసి మురిసిపోతూంటాం. పండగ వెళ్లగానే.. మామిడికాయలు ఎప్పుడొస్తాయా..? అని ఎదురు చూస్తాం. పిందెలు రాగానే తోటల యజమానులు తోటలకు కాపలా పెడతారు. చుట్టూ భారీ ఫెన్సింగ్ ఏర్పాటు...