“ఎన్టీఆర్ – రామ్ చరణ్ 1-0 స్కోర్”: చెత్త పోలికతో కొత్త భాష్యాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ స్టార్ హీరోలు. RRR వంటి ప్రపంచ విజయంతో ఇద్దరూ తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటారు. కానీ కొన్ని తెలుగు వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలు ఈ ఇద్దరి స్నేహాన్ని విస్మరించి, చీప్ పోలికలతో అభిమానుల్లో విభేదాలు రేపుతున్నాయి.

ఇటీవల NTR దేవర హిట్ అయిందని, రామ్ చరణ్ గేమ్ చెంజర్ ఫ్లాప్ అయ్యిందనే భావన వచ్చేలా.. ఇప్పటికీ “ఎన్టీఆర్, రాంచరణ్ స్కోర్ 1-0” అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ పోస్టుల వెనుక అసలు ఉద్దేశ్యం స్పష్టమే – ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడం, హీట్ సృష్టించడం, ఆ హీట్‌ని వ్యూస్ మరియు ట్రాఫిక్‌గా మార్చుకోవడం. ఇది జర్నలిజం కాదు, క్లిక్‌బైట్ కోసం చేసే చీప్ ట్రిక్ మాత్రమే.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మధ్య అసలు ఉన్నది పోటీ కాదు, గౌరవం. హాలీవుడ్ ప్రీమియర్స్ నుండి ఆస్కార్ వేదిక వరకు కలిసి అడుగులు వేశారు. ప్రమోషన్లలో, అవార్డు వేడుకల్లో ఒకరి విజయాన్ని మరొకరు హృదయపూర్వకంగా పంచుకున్నారు. ఇది నిజమైన స్టార్‌డమ్ – పోలికలు కాదు.

ఇద్దరికీ ఇప్పుడు భారీ సినిమాలు రెడీగా ఉన్నాయి. ఎన్టీఆర్ వార్ 2 ప్రస్తుతం రిలీజ్ అవుతుండగా, తదుపరి డ్రాగన్ మూవీ ఉంది. రామ్ చరణ్ పెద్ది వంటి భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమాల విజయం మళ్ళీ వాళ్ళ స్కోర్ ను సూచిస్తుంది అంటూ.. ఇది RRR స్కోర్ బోర్డ్ అంటూ.. సదరు సోషల్ మీడియా పోస్టు ను చూసి… అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. ఇవి అభిమానులను రెచ్చగొట్టడమే కదా.. మంచి దారిలో నడిపించాల్సిన మీడియా, బాధ్యత మరిచి.. క్లిక్స్ కోసం తెగించటం.. ఎలాంటి సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.. సినిమా హీరోలు అంటే.. అందరికీ జయాలు, అపజయాలు అతి సాధారణం.. దీనిని ఇద్దరు హీరోల మధ్య పోలిక గా తీసి లబ్ది పొందాలనుకోవడం ఏ ‘ఇంటెన్షన్’ ను తెలియజేస్తుంది?

తాత్కాలిక హీట్ కోసం చేసే ఈ “1-0 స్కోర్” పోలికలు పరిశ్రమకు హాని కలిగిస్తాయి, ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపుతాయి. అయితే ఇలా పోలిక తీసుకుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కెరీర్ ఇండస్ట్రీ హిట్ ల విషయంలో 3-0 స్కోర్ అని.. రామ్ చరణ్ ఫ్యాన్స్ తిరిగి.. చురకలు వేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు..

సినిమా

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు...

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి వ్యక్తిగత విషయాలను ఎగతాళి చేస్తూనో చేసే...

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

‘పెద్ది’ రిలీజ్ ట్రాక్‌లోనే.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా రిలీజ్ విషయంలో తాజా సమాచారం మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉందని రామ్ చరణ్...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...