Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్-జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. జూలై 24న సినిమా విడుదలవుతూండగా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడీ సినిమాపై నిర్మాత ఏ.ఎం.రత్నం పలు విశేషాలు చెప్పుకొస్తున్నారు. అందులో చార్మినార్ సెట్ సినిమాలో ప్రత్యేకం కానుందని చెప్పారు.
‘కథలో చార్మినార్ ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో చార్మినార్ సెట్ వేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ గారి భారీ ఫ్యాన్ బేస్ కారణంగా చార్మినార్ దగ్గర అనుకున్నట్టుగా తీయలేం. అందుకే సెట్ వేయాల్సి వచ్చింది. ఓ స్టూడియో 4కోట్లు అడిగితే.. మా టీమ్ 75లక్షల ఖర్చుతో అచ్చంగా చార్మినార్ ను తలపించేలా సెట్ వేశాం’.
‘సినిమాలో హార్బర్ సెట్ కూడా 17వ శతాబ్దంలో హార్బర్ ఎలా ఉంటుందో ఊహించి కథానుగుణంగా సెట్ వేశాం. సినిమా చూస్తే మనం ఆ కాలంలోకి వెళ్లిన ఫీల్ వస్తుంది. అంత సహజంగా సెట్స్ వేసి చిత్రీకరించా’మని చెప్పారు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది.
