ఛార్మి .. గ్లామర్ హీరోయిన్ గా అప్పట్లో ఓ రేంజ్ ఇమేజ్ అందుకున్న ఈమే .. ఆ తరువాత వరుసగా పరాజయాలు పలకరించడంతో సినిమాల్లో నటించడం మానేసింది. ఆ వెంటనే పూరి జగన్నాధ్ తో కలిసి సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారిపోయింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తీసే సినిమాలకు ఛార్మి కూడా ఓ నిర్మాతే. ఛార్మి అటు నిర్మాతగా కూడా నిలదొక్కులేకపోతుంది.
ఇప్పటి వరకు ఆమె నిర్మించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపులుగా మిగిలిపోయాయి. తాజాగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మిస్తుంది ఛార్మి. ఈ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా దర్శకుడు పూరి జగన్నాద్ పరిస్థితి అంత బాగాలేదు. ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. వాటన్నిటికీ చెక్ పెట్టెలా ఇస్మార్ట్ శంకర్ ని సిద్ధం చేస్తున్నాడు.
దాదాపు షూటింగ్ పూర్తీ కావొచ్చిన ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులను ఓ కంపెనీ భారీ రేటుకు అడిగారట. నిజంగా అది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు పెద్ద నంబరే. కానీ ఈ సినిమా పై ఉన్న నమ్మకమో ఏమో గాని .. నిర్మాత ఛార్మి మాత్రం సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పిన రేటుకు ఈ సినిమా హక్కులను అమ్మనని చెప్పేసిందట.
నిజానికి ఆ వ్యక్తి చెప్పిన భారీ అఫర్ ఎంతో తెలుసా .. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ హక్కులకోసం ఏకంగా 20 కోట్ల డీల్ ఇచ్చాడట. ముందుగా 10 కోట్లు అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడట. కానీ ఛార్మికి మాత్రం ఈ డీల్ నచ్చకపోవడంతో నో చెప్పిందట. ఈ విషయంలో ఛార్మి తొందర పడిందని, నిజంగా ఈ అఫర్ చాల బెటర్ అయ్యేదని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంన్నాయి . సో ఈ సినిమా విషయంలో పూర్తీ నమ్మకంతో ఉన్న ఛార్మి నమ్మకాన్ని ఇస్మార్ట్ శంకర్ ఎలా నిలబెడతాడో చూడాలి.