ప్రతి సినిమాలోనూ తన ఇమేజ్ కి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ ప్లస్ మంచి యాక్షన్ కూడా ఉండేలా చూసుకునే యంగ్ హీరో గోపీచంద్ నుంచి దసరా కానుకగా రానున్న సినిమా ‘చాణక్య’. సుమారు 25 కోట్ల బడ్జెట్ తో కంప్లీట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. చెప్పాలంటే ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువే వస్తుంటాయి. అలాగే ఇలాంటి స్పై థ్రిల్లర్ సినిమాల్లో కమర్షియల్ హంగులైన కామెడీ, లవ్ ట్రాక్ లాంటివి జోడించి చెప్పడం కాస్త కష్టతరం.
కానీ ఈ చిత్ర డైరెక్టర్ తిరు మాత్రం అన్నీ సూపర్బ్ గా మిక్స్ చేసి ఈ కథని చేశారని, పక్కాగా దసరాకి అందరూ మెచ్చే సినిమా చాణక్య అవుతుందని గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. మేము ఇంకొంచం ముందుకెళ్ళి సెన్సార్ రిపోర్ట్ కనుక్కున్నాం. మరి ఆ డీటైల్స్ మీకోసం.
సీటీమార్ పాయింట్స్:
>> హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ – చాణక్యలో గోపీచంద్ చేసిన చాలా రిస్కీ స్టంట్స్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయట.
>> కరాచీ బ్యాక్ డ్రాప్ లో నువ్వా నేనా అంటూ హీరోకి – విలన్ కి మధ్య సాగే ప్లే బాగుంటుందట.
>> అలాగే కథలో వచ్చే మేజర్ ట్విస్ట్ అయిన ఇంటర్వల్ బ్లాక్ హుక్ చేస్తుందన్నారు.
>> ఆ చాణక్యుడిలా ఈ చాణక్య ఐడియాస్ కూడా థ్రిల్ చేస్తాయట.
>> ఫస్ట్ హాఫ్ లో గోపీచంద్ – సునీల్ కాంబినేషన్ కాస్త నవ్విస్తుందట.
>> హీరో విలన్ చాలెంజింగ్ డైలాగ్స్ కూడా బాగుంటాయన్నారు.
బోరింగ్ పాయింట్స్:
>>ఫస్ట్ హాఫ్ లో కమర్షియాలిటీ కోసం యాడ్ చేసిన కొన్ని సీన్స్ బోర్ కొట్టే అవకాశం ఉందట.
ఇంతకూ మించి మనం నెగటివ్స్ గురించి మాట్లాడద్దు. అక్టోబర్ 5న సినిమా చూసాక కంప్లీట్ రివ్యూతో కలుద్దాం. అలాగే ‘చాణక్య’ లైవ్ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మా Telugubulletin.com సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.
