కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి రీసెంట్ గా నాగ చైతన్యతో తండేల్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గీతా ఆర్ట్స్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న చందు మొండేటి తన నెక్స్ట్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నాడని తెలుస్తుంది. చందు రీసెంట్ ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
సూర్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నాడు కానీ సరైన కథ కుదరక వెనకడుగు వేస్తున్నాడు. ఇప్పటికే సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇప్పుడు చందు మొండేటితో కూడా సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఐతే సూర్య సినిమా గురించి చందు చూచాయగా కథ చెప్పుకొచ్చారు. అది 300 ఏళ్ల నాటి కథతో వస్తుందని అన్నారు.
పిరియాడికల్ కథ అది కూడా సూర్య లాంటి హీరో అంటే తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కంగువతో భారీ హిట్ కొట్టాలని చూసిన సూర్య ఆ సినిమా మిస్ ఫైర్ అవ్వడంతో కాస్త డీలా పడ్డాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమా తర్వాత వెంకీతో ఒక సినిమా చందు మొండేటితో మరో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఐతే చందు సినిమా 300 ఏళ్ల నాటి కథ అని అంటున్నారు కానీ అది ఎలా ఉంటుంది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.