Switch to English

జగన్ కు పాలన చేతకాదు.. ప్రజలిచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది: చంద్రబాబు

91,427FansLike
56,276FollowersFollow

ఏపీ చరిత్ర టీడీపీ రాకముందు.. వచ్చిన తర్వాత అని చదువుకోవాలని.. టీడీపీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సేవా భావం ఉన్న పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘40 ఏళ్లలో పార్టీకి ఎదురైన ఇబ్బందులు ఒకెత్తయితే.. ఈ మూడేళ్లలో ఎదురైన ఇబ్బందులు ఒకెత్తు. చేతగాని దద్దమ్మ పాలనలో రాష్ట్రం అప్రతిష్టపాలైంది. జగన్ కు అభివృద్ధి చేయడం చేతకాదు. పోలీసులను అడ్డుపెట్టకుని పరిపాలన చేస్తున్నారు. అడిగితే కేసులు పెడుతున్నారు. మీరెంతగా రెచ్చగొడితే టీడీపీ కార్యకర్తలు అంతగా రెచ్చిపోతారు’.

‘అమ్మఒడి తీసుకొచ్చి.. నాన్న బుడ్డి కూడా తీసుకొచ్చారు. పోలవరం, ప్రత్యేకహోదా, విభజన హామీలేమయ్యాయి. 30లక్షల ఇళ్లని చెప్పిన కట్టింది మూడే ఇళ్లు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలేమయ్యాయి. మోటార్లు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. రైతులకు మంచి రోజులు వస్తాయి. మేము అండగా ఉంటాం. మద్యపాన నిషేధం అని.. నాసిరకం బ్రాండ్లతో దండుకుంటున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ తో నేరాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇసుక దొరక్క నిర్మాణరంగం కుదేలైంది’.

‘సామాజిక న్యాయం అంటూ రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చారు..? ఎస్సీ వ్యక్తిని సొంత ఎమ్మెల్సీ బయటకు తీసుకెళ్లి హత్య చేసి.. కారులోనే ఇంటికి తీసుకొచ్చారు. దీనిని కప్పిపుచ్చేందుకు కోనసీమలో విధ్వంసం సృష్టించి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. మంత్రి ఇంటిపై దాడి చేసినా అడ్డుకోకపోవడానికి కారణం ఏంటి..? గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన లేకపోవడంతో మంత్రుల బస్సు యాత్ర చేపట్టారు’.

‘ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. కరెంట్ తీగే కదా.. ఓసారి పట్టుకుందామంటే ఏమవుతుంది..? ఏపీ పరిస్థితి అలానే అయింది. ఒక్క చాన్స్ అని తీసుకున్న చాన్స్ వైసీపీకి అయిపోయింది. నాకు సీఎం పదవి కొత్త కాదు. రాష్ట్రం ఎటూకాకుండా పోయిందనే బాధ.. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడాలనే బాధ్యత ఉంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

మహేష్ బాబుకి తల్లి అంటే అమితమైన ఇష్టంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న...

ఇక ‘టాప్ గేర్’ వేస్తున్న ఆది సాయికుమార్.

వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమై పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో...

ది ఘోస్ట్‌ రిలీజ్ ట్రైలర్‌.. మళ్లీ అదే యాక్షన్‌

నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్‌ సినిమా అక్టోబర్‌ 5న దసరా సందర్భంగా రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కాస్త జోరుగానే సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ది...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సరస్వతి దేవిని అర్చించారు....