Switch to English

చంద్రబాబు ‘ప్రజా చైతన్య యాత్ర’.. సాధించేదెంత.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అరాచక పాలనపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న విషయం విదితమే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాది సమయం అయినా ఇవ్వకుండా, ప్రధాన ప్రతిపక్షం ఇలాంటి యాత్రలు చేపడితే, వాటికి ప్రజల నుంచి ఆశీస్సులు వుంటాయా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

అయితే, రాష్ట్రంలో ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతునన మాట వాస్తవం. ఆ సమస్యలన్నిటికీ చంద్రబాబు పాలనే నిదర్శనమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ వస్తోంది. అభివృద్ధి ఆలోచనల్ని పక్కన పెట్టేసి, సంక్షేమం పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న మాట వాస్తవం. చంద్రబాబు పాలనను మరిపించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దూసుకుపోతోంది అప్పుల విషయంలో. అప్పు చేసి పప్పుకూడు అన్న చందాన, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్న విమర్శలున్నాయి.

అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు గనుక.. సంక్షేమ పథకాల పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసే పబ్లిసిటీ స్టంట్లు కొంత మేర బాగానే వర్కవుట్‌ అవుతున్నాయి. అదే సమయంలో చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో అతి తక్కువ కాలంలోనే, అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను జనం నుంచి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎదుర్కొంటోందన్నదీ నిర్వివాదాంశం.

సరిగ్గా, ఇదే తమకు కలిసొస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే, ఇప్పట్లో ఎన్నికలొచ్చే పరిస్థితి కన్పించడంలేదు ఆంధ్రప్రదేశ్‌లో. మరి, అలాంటప్పుడు చంద్రబాబు ‘ప్రజా చైతన్య యాత్ర’ చేస్తే ఏం ప్రయోజనం.? ఈ విషయమై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ప్రతిపక్షంగా ప్రజల తరఫున వుండకపోతే పలచనైపోతామన్న కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ప్రజా చైతన్య యాత్ర విషయంలో.

అవును మరి, ఇది సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే, యాత్ర బెడిసికొడితే.. రాజకీయంగా టీడీపీ మరింత అభాసుపాలైపోయే ప్రమాదముంటుంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

శానిటైజ్ చేసేప్పుడు ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇలానే పేలిపోద్ది.!

జాగ్రత్త సుమీ: వెహికల్ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిన ఈ కరోనా టైంలో బైక్ ఇంజిన్ ఆన్ లో ఉండగా శానిటైజ్ చేయించవద్దు. అలా చేస్తే ఇలానే మంటలు చెలరేగి ప్రాణాలు పోగొట్టుకునే...

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...