టీడీపీలో చివరికి మిగిలేది ఆ ముగ్గురేనట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,097FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమెలాగో తనకు బాగా తెలుసని చెబుతుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదనీ, తిరిగి పుంజుకుంటామనీ చంద్రబాబు పైకి చెబుతున్నప్పటికీ, గతంతో పోల్చితే ఇప్పుడు చంద్రబాబు మాటలపై ఆ పార్టీ నేతల్లో విశ్వసనీయత ఎవరికీ కన్పించడంలేదు. అందుకేనేమో, గెలిచినవాళ్ళు.. ఓడినవాళ్ళూ.. టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టీడీపీని వీడే దిశగా అడుగులు వేస్తున్న విషయం విదితమే. బీజేపీతోనూ వైఎస్సార్సీపీతోనూ ఏకకాలంలో ఆయన టచ్‌లో వున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఎమ్మెల్యేలలో దాదాపుగా అందరూ పార్టీని వీడటం ఖాయమన్న గుసగుసలు విన్పిస్తోంటే, సగానికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలో తమతో టచ్‌లో వున్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం.

ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, బీజేపీతో టచ్‌లోకి వెళ్ళారట. ‘బీజేపీ పెద్దలు మాతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవం..’ అంటూ సదరు ఎంపీలు చెబుతున్నారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘చంద్రబాబుకి చెప్పే నిర్ణయం తీసుకుంటాం’ అని ఓ ఎంపీ చెబుతోంటే, ‘ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదుగానీ.. కార్యకర్తల నుంచి ఒత్తిడి వుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంది’ అని మరో ఎంపీ తన పరిస్థితిని వివరిస్తున్నారు.

మొత్తంగా ఎంపీలందరిదీ ఇదే పరిస్థితి అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎంపీ తనకు అత్యంత సన్నిహితుడైన ఓ మీడియా ప్రతినిథి వద్ద అసలు విషయాన్ని లీకు రూపంలో బయటపెట్టేశారు. ‘బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇస్తాం..’ అంటూ టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత (రాజ్యసభ సభ్యుడు కూడా)కు బడా ఆఫర్‌ ఇచ్చిందట బీజేపీ అధిష్టానం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సదరు ఎంపీకి సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాల్ని తట్టుకోలేక సతమతమవుతున్న సదరు టీడీపీ ముఖ్య నేత, బీజేపీతో కలిసుంటే ఇతరత్రా సమస్యలూ తగ్గుతాయనే భావనలో వున్నారట.

ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అటు రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు టీడీపీని వీడితే చివరికి చంద్రబాబు వెంట మిగిలేదెవరు.? నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ మాత్రమేనేమో. టీడీపీకి మరీ అంతటి దారుణమైన పరిస్థితి వస్తుందా.? అంటే, తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూశాక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యమేముందని టీడీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు ఆఫ్‌ ద రికార్డ్‌గా వ్యాఖ్యానించడంలోనే అన్ని విషయాలూ స్పష్టంగా అర్థమయిపోతున్నాయ్‌.

మరి, సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడంలో సిద్దహస్తుడినని చెప్పుకునే చంద్రబాబు నిజంగానే అంతటి సమర్థుడా? సమర్థుడైతే తెలంగాణలో పార్టీని ఎందుకు బాగు చేసుకోలేకపోయారు.? చివరికి ఏమీ చేయలేక ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీ జెండా పీకేసి.. బీజేపీలోనో, కాంగ్రెస్‌లోనో చంద్రబాబు కూడా కలిసిపోతారేమో!

6 COMMENTS

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

ఎక్కువ చదివినవి

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే భిన్నంగా, షాకింగ్‌గా ఉండే క్లైమాక్స్‌ను సిద్ధం...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు...

Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...