Switch to English

దావోస్‌కు సీఎం చంద్రబాబు… ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఏపీపై

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరనున్న ఆయన బృందం ఢిల్లీ మీదుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లనుంది. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో సీఎం పాల్గొని ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.

జ్యూరిచ్ చేరుకున్న వెంటనే స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు కిషోర్ లుల్లా, రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో సమావేశం జరుగుతుంది. అదే రోజు భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం పాల్గొని 20 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన దావోస్‌కు చేరుకుంటారు.

దావోస్‌లో తొలి రోజు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో పాటు పలు దేశాల ప్రతినిధులతో సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కీలక భేటీలు జరగనున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మీడియా సంస్థ పొలిటికోకు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

రెండో రోజు ఇండియా అట్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా ‘జియోగ్రఫీ ఆఫ్ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్’ అంశంపై నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత ఇండియా లాంజ్ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌లతో కీలక చర్చలు జరుపుతారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొని ఏపీ పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వనున్నారు.

దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే వివిధ సెషన్లలో సీఎం పాల్గొంటూ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇన్నోవేషన్, మౌలిక వసతులు, పరిశ్రమల అభివృద్ధి అంశాలపై ప్రసంగిస్తారు. వరల్డ్ ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, స్విట్జర్లాండ్ ప్రభుత్వ పెద్దలు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రితో పాటు అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎన్విడియా, మోలర్ మేర్స్క్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, జాన్ కాక్రిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతోనూ చర్చలు జరగనున్నాయి.

మూడో రోజు ప్రపంచ ఆర్థిక వేదికలో నిర్వహించే ప్రధాన సెషన్లలో పాల్గొని ఏపీ పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై తన దృష్టిని వివరించనున్నారు. మొత్తం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 36 కార్యక్రమాల్లో పాల్గొననుండగా, 16 వన్ టు వన్ సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, పలు ప్లీనరీ సెషన్లలో పాల్గొననున్నారు.

జనవరి 22న దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు బయల్దేరనున్న సీఎం, జనవరి 23 ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల పాటలను అనుమతి లేకుండా ఎక్కడా వినియోగించరాదని...

Daily Horoscope: ఈ రోజు మేషం, వృషభం వారికి శుభవార్తలు

ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో వేగం పెరిగి అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. చిన్న ప్రయాణం లాభదాయకంగా...

‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారమే స్పెషల్ సాంగ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారంలోనే తొలి సాంగ్ విడుదల కానుంది. జై జ్ఞాన ప్రభ...

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వ్యవస్థాపక దినోత్సవం.. సేవల ప్రయాణానికి నారా లోకేష్ అభినందనలు

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నినదించిన “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే భావనతో ప్రేరణ పొందిన...

చిరంజీవి చేతికి బ్యాండ్ ఎందుకు? అభిమానుల్లో టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలలో చేతికి బ్యాండ్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన శుభలేఖ అందుకునే సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్...