Switch to English

చంద్రబాబు ఇక తప్పుకోక తప్పదా?

చంద్రబాబుకు రోజు రోజుకు కష్టాలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు బాబుకు ఏమైంది… ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. ఒకప్పుడు చాల కాన్ఫిడెంట్ గా మాట్లాడే బాబు ఇటీవల కాలంలో అయన మాట్లాడుతున్న మాటలను ఒకసారి పరిశీలించి చూస్తే, అసలు మాట్లాడుతుంది బాబేనా అనిపిస్తోంది. ప్రజా చైతన్య యాత్ర పేరుతో బాబు 45 రోజులపాటు వంద నియోజక వర్గాల్లో పర్యటించాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా యాత్ర చేస్తున్నారు.

అయితే, ఇదే ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా చేస్తున్నది. వైకాపా పార్టీ బలంగా ఉండటమే కాకుండా, కొన్ని విషయాల్లో ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన జరుగుతుంది. ఇది వాస్తవం. పెన్షన్ విషయంలో కావొచ్చు, మరొక విషయంలో కావొచ్చు. వైకాపా పార్టీ కొన్ని విషయాల్లో కొంత సక్సెస్ అయ్యింది. దీంతో ప్రజల్లో వైకాపాకు కొంతమేర డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర పేరుతో వైకాపాపై విమర్శలు చేయడం వలన ఉపయోగం లేదు.

కేవలం పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే బాబు ఇలా యాత్ర చేస్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వైకాపా సిట్ వేసిన తరువాత బాబు స్వరం పెరిగింది. మాట తీరు మారిపోయింది. తెలియని భయం ఆయన మాటల్లో కనిపిస్తోంది. సిట్ ఎవరు వేయమన్నారు, సిట్ ఎందుకు వేశారు, ఎవర్ని పడితే వారిని ఎలా ప్రశ్నిస్తారు అని బాబు అనడం వెనుక అర్ధం ఏంటో తెలియడం లేదు.

ఇలా మాట్లాడటం వలనే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇలానే మాట్లాడుతూ ఉంటె వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ 23 సీట్లు కూడా వస్తాయా రావా అనే డౌట్ వస్తోంది. అసలు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంటుందా లేదంటే పార్టీ మరొక పార్టీలో కలిపేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళపై సిట్ బాబును అరెస్ట్ చేస్తే ఆ పార్టీ గతి ఏంటి? బాబు పార్టీ నుంచి తప్పుకొని రెస్ట్ తీసుకుంటే మంచిది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

యంగ్ హీరో కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం

ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో...

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...