చంద్రబాబు మార్క్.. అమరావతిలో భూములిస్తామంటూ నిరసన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

ఏపీ రాజధాని అమరావతి మళ్లీ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. గత ఐదేళ్లు అసలు అమరావతి ఊసే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు మళ్లీ తన మార్క్ చూపిస్తుండటంతో.. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐదేళ్లలో ప్రాజెక్టులు అమరావతికే రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ ఆయా సంస్థలను కలిసి అమరావతికి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. దావోస్ పర్యటన తర్వాత అమరావతికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో మొన్నట వరకు లోన్లే ఇవ్వం అని చెప్పిన ఎస్బీఐ, యానిమల్ బ్యాంకులు కూడా అభివృద్ధిని చూసి లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

ఇంకో వైపు కేంద్రం కూడా భారీగా సాయం చేస్తోంది. ఇప్పటికే సెంట్రల్ బడ్జెట్ లో వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రైలు, రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ఇలా ఏపీ రాజధాని కోసం అందరూ సహకరిస్తుండటంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతి కోసం ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూములు సేకరించేందుకు సిద్ధం అవుతోంది. మరో 44 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండటంతో రైతులే స్వయంగా ముందుకొస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం భూములు తీసుకుంటే రైతులు వ్యతిరేకిస్తారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై పోరాడుతారు.

కోర్టు కేసుల దాకా వెళ్లి తమ భూములు మాత్రం ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో సాగుతోంది. మా భూములు తీసుకోవాలంటే మా భూములు తీసుకోవాలంటూ స్వయంగా రైతులే నిరసనకు దిగుతున్నారు. భూములు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఇది చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు. రైతుల్లో ఈ మార్పు రావడానికి కారణం ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం అందించిన మేలు, వారికి జరుగుతున్న అభివృద్ధి. తమ భూములు ఇస్తే తాము కూడా అభివృద్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. అంతే కాకుండా తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందనేది వారి నమ్మకం.

అందుకే ఈ 44వేల ఎకరాల సమీకరణ ప్రభుత్వానికి అసలు పెద్ద కష్టమే కావట్లేదు. వద్దన్నా భూములు ఇచ్చేలా ఉన్నారు రైతులు. త్వరలోనే దీనిపై జీవో కూడా విడుదలయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన ప్రతి ఎకరానికి సరిపడా ప్రతిఫలం ప్రభుత్వం అందిస్తోంది. ఎవరికీ సాయం ఆపకపోవడంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతిలో ఎక్కడా రైతులకు అన్యాయం జరగకపోవడం మరో అంశం. ఏదేమైనా అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మార్క్ వ్యూహం బాగా కలిసి వస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఇలాగే సాగితే గనక.. రాబోయే మూడేళ్లలో అమరావతి రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు తన హయాంలోనే అమరావతి, పోలవరం రెండు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. తన రాజకీయ చరిత్రలో ఈ రెండూ మైల్ స్టోన్ లాగా నిలుస్తాయి. అందుకే ఆయన పట్టుబట్టి మరీ అటు కేంద్రంతో, ఇటు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతూ పనులు ఆగకుండా చూసుకుంటున్నారు.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

“సునీల్ కోసం ప్రత్యేక కథ… డైరెక్టర్‌గా రవి కె. చంద్రన్?”

టాలీవుడ్‌లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Ravi K. Chandran దర్శకుడిగా కొత్త సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రానికి కథను ప్రత్యేకంగా నటుడు Sunil కోసం...

Daily Horoscope: కర్కాటకానికి ఆర్థిక లాభాలు.. ధనుకు కొత్త అవకాశాలు

మే 2 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు చంద్రస్థితి ఆధారంగా గ్రహాల ప్రభావం అన్ని రాశులపై భిన్నంగా ఉంటుంది. కొందరికి ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉండగా, మరికొందరికి కొత్త అవకాశాలు దక్కే...

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల పాటు Ramayana నుంచి ప్రేరణ పొందిన...

“ఇది కేవలం ఆరంభం మాత్రమే…”: ఏపీ ప్రగతిపై లోకేష్ వ్యాఖ్యలు

అమరావతి: గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’...

“తెలియకుండానే అవుట్?: ‘AK47’లో మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై షాక్ ట్విస్ట్”

Venkatesh Daggubati హీరోగా, Trivikram Srinivas దర్శకత్వంలో రూపొందుతున్న AK47 సినిమాకు సంబంధించి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా Harshavardhan Rameshwar మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసిందే....