Switch to English

నిప్పురా.. చంద్రబాబు దాహం తీరనిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

ఎన్నికల ఫలితాల విడుదలకు ఎంతో దూరం లేదు. అసెంబ్లీకి ఎన్నికలు జరగడమంటే, అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం తాలూకు పదవీ కాలం ముగిసినట్లే. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు ఎన్నికల కోడ్‌ అంటే ఏంటో తెలియకుండా ఉంటుందా.? ఆయన ఎంతలా బుకాయించినా, ఇప్పుడాయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ‘ఈ దాహం తీరనిదీ..’ అన్నట్లుగా ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిపై ఆశ వదులుకోవడం లేదు. నిజానికి వదులుకోవల్సిన అవసరం లేదు. ఏమో అదృష్టం కలిసి వచ్చి ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవ్వచ్చేమో.

కానీ, ఫలితాలు వచ్చే వరకూ కొంచెం హుందాతనం ప్రదర్శించాలి కదా. అదే కనిపించడం లేదు చంద్రబాబులో. సమీక్షలంటారు.. అధికారుల మీద మండిపడతారు. ఇది సంధి కాలం. అధికారుల్లో, ప్రజల్లో సానుకూలత సంపాదించడం ద్వారా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి చంద్రబాబుకు ఇది అద్భుతమైన అవకాశం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోల్చుకోవడం, దేశ ప్రధాని నరేంద్రమోడీతో పోల్చుకోవడం చంద్రబాబుకు తగని పని. వాళ్లు సమీక్షలు చేస్తున్నారు కాబట్టి, తానూ చేస్తానంటున్న చంద్రబాబు తన సీనియారిటీకి, తానే మచ్చ తెచ్చుకుంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల కోసమే తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోడ్‌ని పాఠించాల్సి వస్తోంది. ఇంకో నాలుగున్నరేళ్లకి పైనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. కేసీఆర్‌ ఎదుర్కొంటున్నవి అసెంబ్లీ ఎన్నికలు కావు. కాబట్టి, ఆయన సమీక్షలు జరపాల్సిందే. ప్రధాన నరేంద్రమోడీ విషయానికొస్తే, దేశ భద్రత సహా, అనేక కీలక అంశాలు అత్యంత ముఖ్యమైనవి కనుక ప్రధాని హోదాలో ఆయన కూడా సమ్షీలు చేయక తప్పనిసరి పరిస్థితి. కానీ చంద్రబాబుకు అలా కాదు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఈ దశలో సమీక్షలు నిర్వహిస్తానని అత్యుత్సాహం చూపడం హాస్యాస్పదమే.

మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రసహనం, ఆయన రాజకీయ జీవితానికే మాయని మచ్చ. ఎందుకంటే, అధికారులెవరూ ముఖ్యమంతిని గౌరవించడం లేదు. ఆ గౌరవాన్ని పదే పదే చంద్రబాబు అడుక్కోవల్సి వస్తోంది. ఇంతవరకూ ఛీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలవలేదు. మర్యాదపూర్వంగా అయినా, చంద్రబాబును కలవాల్సిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ప్రవర్తన కూడా కొంత అభ్యంతరకరంగానే ఉందనీ, రాజకీయ పండితులు అభిప్రాయ పడుతు9న్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాబోతున్నారనీ, అందుకే అధికారులెవరూ చంద్రబాబును లెక్క చేయడం లేదనీ ఇంకో అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమైతే, అధికారులు కూడా తప్పిదానికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి మాత్రమే కాదు, చంద్రబాబు సీనియర్‌ పొలిటీషియన్‌. ఆయనకు అధికారులు గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అదే సమయంలో చంద్రబాబు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. సమీక్షల పేరుతో అత్యుత్సాహం అస్సలేమాత్రం తగదు. తాజాగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చంద్రబాబు వెళితే, అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో క్యాబినెట్‌ మీటింగ్‌ కూడా పెడతానంటున్నారు. అర్ధం పర్ధం లేని ఇలాంటి చర్యలతో రోజు రోజుకూ చంద్రబాబు తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారు.

12 COMMENTS

సినిమా

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

కృష్ణంరాజు జయంతి సందర్భంగా మధిరలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 20న స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 86వ జయంతిని పురస్కరించుకుని భారీ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు....

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

రాజకీయం

ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి.. ఘన నివాళులు, స్మృతుల స్మరణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్‌కు పూలమాలలు...

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళటమే నా లక్ష్యం: బాలకృష్ణ

తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయుడైన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నేడు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. హృదయంలో...

అనంతపురం ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు… ఏం జరుగుతోంది?

అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ వ్యవహారం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో టీడీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో...

బండ్ల గణేష్ సంకల్పయాత్ర .. రేపు కాలి నడకన – తిరుపతికి

నిర్మాత బండ్ల గణేష్ తన సంకల్పాన్ని నెరవేర్చుకోనున్నారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసులు ఆధారం లేనివని తేలి, పూర్తిగా క్లియర్ అయిన నేపథ్యంలో ఆయన మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి సంకల్పయాత్ర చేపట్టనున్నారు....

దావోస్‌కు సీఎం చంద్రబాబు… ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఏపీపై

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరనున్న ఆయన...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ఆర్థిక లాభాలు మేషానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కన్యకు

జనవరి 12, 2026 సోమవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో లాభ సూచనలు కనిపిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను జనవరి 16న విడుదల...

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్ బాబు పేరును స్మరించుకుంటూ ఆయన అభిమానులు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే (2008) వరకూ ఇదే పరిస్థితి. చిరంజీవిని...