నేనే శంకుస్థాపన చేశా.. నేనే వెలిగొండ పూర్తి చేస్తా: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

అమరావతి: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలన్న ఆలోచన ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని, దశాబ్దాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెలిగొండ ప్రాజెక్టు రూపకల్పనకు ఇంజినీర్ కుడితపూడి శ్రీరామకృష్ణయ్యను నియమించగా, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 1989లో ప్రాజెక్టు రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. 1996 మార్చి 5న ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, 1999లో తొలి దశ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్యలో పనులను వేగవంతం చేసి మొదటి సొరంగం దాదాపు పూర్తి చేశామని, ఆ కాలంలోనే రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు.

2019 నుంచి 2024 మధ్యలో ప్రాజెక్టు పనులు తీవ్రంగా నిలిచిపోయాయని విమర్శించారు. పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. టన్నెల్‌లలో తవ్విన మట్టిని తరలించకపోవడం, బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కాలువ పనులు పెండింగ్‌లో ఉంచడం, పునరావాసం ఇవ్వకపోవడం వంటి లోపాలను ప్రస్తావించారు. టన్నెల్–2లో బోరింగ్ యంత్రం పాడై ఇరుక్కుపోయి ఉండటంతో నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన చర్య ప్రజల విశ్వాసానికి దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చెప్పారు. 20 నెలల్లో పెండింగ్ బిల్లుల కింద రూ.140 కోట్లు చెల్లించామని, రూ.585 కోట్ల పనులు తక్షణమే చేపట్టామని తెలిపారు. టన్నెల్ సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల కంటే ఈ కాలంలోనే ఎక్కువ మేర బెంచింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, మార్చి నాటికి నీటి నిల్వకు వీలయ్యేలా మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్స్ పనులను రూ.456 కోట్లతో చేపడుతున్నామని, జూన్ నాటికి వేలాది కుటుంబాలకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే నల్లమల సాగర్‌లో భారీగా నీటి నిల్వ సాధ్యమవుతుందని, దశలవారీగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భూగర్భ జలాలు ప్రస్తుతం లోతుల్లో ఉన్నాయని, ప్రాజెక్టు పూర్తయితే జలమట్టం గణనీయంగా పైకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నీటి కొరత తగ్గితే వ్యవసాయం నిలకడగా సాగుతుందని, పరిశ్రమలు రావడానికి కూడా మార్గం సుగమమవుతుందని వివరించారు.

మార్చి 5తో ప్రాజెక్టు భూమిపూజకు 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది జూన్ నాటికి వెలిగొండ స్టేజ్–1 పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2027–28 నాటికి స్టేజ్–2 పనులు కూడా పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వెలిగొండ ద్వారా మార్కాపురం ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతామని పేర్కొంటూ, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పరిశ్రమల అభివృద్ధికీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

అంతర్వేదికి శుభవార్త… తాగునీటి కష్టాలకు చెక్

అంతర్వేది ప్రాంత ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక శుభవార్త అందించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టిన ఆయన, రూ.17.33 కోట్లతో నిర్మించిన...

కాకినాడలో ఒక్క గుంత కూడా కనిపించకూడదు.. ప్రతి రెండు నెలలకు వస్తా: పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ మరియు పిఠాపురం...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

ధాన్యం అమ్మితే.. గంటల్లోనే డబ్బులా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన వెంటనే లేదా చాలా తక్కువ సమయంలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని...

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...