Switch to English

కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

‘కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

‘‘వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019కి 3లక్షల అప్పు ఉంటే.. జగన్ 32నెలల పాలనలో అది 7లక్షలకు పైగా అయింది. ఏపీ భవిష్యత్‌ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలి.. జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి. ఇటువంటి సమయంలో ప్రజా చైతన్యం అవసరం. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో పాలన ప్రారంభించారు. రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా 50వేల ఎకరాలు ఇస్తే అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వాలు ఇలాగే చేస్తే హైదరాబాద్‌ ఉండేదా?. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి ఇప్పుడు మాట తప్పారు.

అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే ఏపీకి భవిష్యత్తు. 2021కి పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం, మంత్రి ఇప్పుడెక్కడున్నారు..? ఏపీకి ప్రాజెక్టులు తేవడమంటే విధ్వంసం చేసినంత సులువు కాదు. మేము 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశాం. అవి వస్తే 30వేల ఉద్యోగాలు వచ్చేవి. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రంలో వరి వేయొద్దంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం అన్నారు.. కానీ, టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారు.

జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చారు.  ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. దాడులు చేస్తున్నారు. చెత్తమీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌ రెడ్డిది. అన్న క్యాంటీన్లు మూసివేశారు? రెండేళ్లలో కరెంట్‌ ఛార్జీలను ఆరుసార్లు పెంచారు. మద్యనిషేధం అంటూ రాష్ట్రంలో మద్యంపై పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారు. మేము ఇసుక ఉచితంగా ఇస్తే గొడవ చేసి.. ఇప్పుడు 5రెట్లు ఎక్కువకు దోచుకుంటున్నారు. ఓటీఎస్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...