చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. గతంలో 2014-2019 లో కూడా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే బాబు పాలనలో కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఆయన బ్రాoడ్ తోనే ఆటోమోబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారతపోర్జ్, హీరో గ్రూపు రాగా, ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగం లో ఫాక్స్ కాన్, సెల్ కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్స న్, రిలయన్స్, టీసియల్, ఓల్టాస్ లాంటి పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.

ఏ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా సరే అక్కడకు పరిశ్రమలు రావాలి. ఉద్యోగాలు సృష్టించబడాలి. ప్రజల ఆదాయ మార్గాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్ గా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. చంద్రబాబు గతంలో పెట్టుబడుల రాక పట్ల చూపించిన శ్రద్ధ, తపన గురించి పరిశ్రమల రంగంలో మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆయన హయాంలోనే పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. పెట్టుబడులు అనేవి ఒక భరోసా ఉంటేనే వస్తాయని.. అక్కడున్న నాయకత్వం నుంచి నమ్మకం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే వచ్చిన చాలా కంపెనీల ప్రతినిధులు చెబుతున్న మాట.

కానీ వైఎస్ జగన్ హయాంలో ఏం జరిగిందో అందరూ చూశారు. 2019 -2024 మే వరకు రాష్ట్రంలో అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోవడంపై అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చలు జరిగాయి. దాంతో జగన్ హయాంలో కొత్త వారెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. జగన్ హయాంలో జరిగిన నష్టాన్ని ఇప్పుడు చంద్రబాబు భర్తీ చేస్తున్నారు. అనేక కంపెనీలను తిరిగి ఏపీకి రప్పిస్తున్నారు 11 నెలల కాలంలో ఎస్‌ఐపీబీ ఇప్పటికి ఆరుసార్లు సమావేశం అయి 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

వీటి ద్వారా 4,50,934 మంది ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. చివరగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో 19 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టులతో ఏపీకి ఎంత లేదన్నా రూ.33 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని 50 వేల హోటల్‌ రూములు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే ఏపీలో రద్దీగా ఉండే 21 ఆలయాల్లో వసతి సౌకర్యం పెంచే దిశగా నిధులు కేటాయిస్తున్నారు.

ఇలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఏపీకి. పైగా పెట్టుబడులు ఒకే జిల్లాలో కాకుండా అన్ని జిల్లాల్లో సమాంతరంగా ఉండేలా చూస్తున్నారు. డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కుమరవరం, అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైంది. ఇది రూ.1,560 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ రూ.1,400 కోట్ల పెట్టుబడులతో పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో వస్తోంది. అలాగే కర్నూలులో పీయూఆర్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అనకాపల్లిలోరూ.2,300 కోట్ల పెట్టుబడులులు వచ్చాయి. ఇలా అన్ని జిల్లాల్లో పెట్టుబడులు సమాంతరంగా తీసుకొస్తూ అన్ని జిల్లాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పవన్ కళ్యాణ్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan – Surender Reddy కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం...

Daily Horoscope: “కర్కాటకంలో శుభవార్త… మకరంలో ఆర్థిక జాగ్రత్త అవసరం”

ఏప్రిల్ 16 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరంగా సూచిస్తున్నాయి. పనులు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ...