Chandoo Mondeti: ‘తండేల్’ సినిమా అందించిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు నాగచైతన్య. దర్శకుడు చందూ మొండేటి విజన్, దర్శకత్వ ప్రతిభ, షాట్ మేకింగ్ ను లెజండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సైతం మెచ్చుకున్నారు. నాగచైతన్యతోనే గతంలో ‘ప్రేమమ్, సవ్యసాచి’ తెరకెక్కించి హిట్ సాధించిన వీరిద్దరూ మళ్లీ బ్లాక్ బస్టర్ సాధించారు.
ఇప్పుడు మరోసారి కలిసి పని చేయనున్నట్టు అధికారికంగానే ప్రకటించారు దర్శకుడు చందూ మొండేటి. తండేల్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘నేను, నాగచైతన్య మరోసారి కలిసి పని చేస్తాం. శోభిత, మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. ఆ తెలుగును మా హీరోకి ట్రాన్స్ ఫర్ చేయండి. ఎందుకంటే.. మేం భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం’.
‘అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను నేటి జనరేషన్ కు అనుగుణంగా తీర్చిదిద్ది తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాం. ఏఎన్నార్ స్థాయి పెర్ఫార్మెన్స్ మళ్లీ నాగచైతన్య చేస్తారు.. మనం చూస్తా’మని అన్నారు. దీంతో ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.