Switch to English

సినిమా రివ్యూ: చాణక్య

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ తదితరులు.
ఎడిటర్‌: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
మ్యూజిక్: విశాల్ శేఖర్
దర్శకత్వం: తిరు
నిర్మాణం: ఏకె ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేదీ: 05 అక్టోబర్ 2019

మాచో హీరో గోపీచంద్ హీరోగా ఇండియన్ రా ఏజంట్ అర్జున్ పాత్రలో నటించిన సినిమా ‘చాణక్య’. కంప్లీట్ స్పై థ్రిల్లర్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందిన ఈ సినిమా గోపీచంద్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందని, ప్రతి యాక్షన్ ఫిల్మ్ లవర్స్ కి ఈ సినిమా నచ్చుతుందని చెప్పారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర మేధావి అయిన ఆ చాణక్యుడిలా ఈ చాణక్య ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసి పాకిస్థాన్ ఆట కట్టించాడన్నది చూద్దాం..

కథ:

ఇండియన్ సీక్రెట్ ఏజంట్స్ లో ది బెస్ట్ అనిపించుకున్న అర్జున్ శ్రీకర్(గోపీచంద్) సిరియాలో చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా కథకి పరిచయం అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లైన ఇబ్రహీం ఖురేషి(రాజేష్ ఖత్తర్) మరియు అతని కొడుకు సోహైల్ ఇబ్రహీం ఖురేషి(ఉపేన్ పటేల్) లను పట్టుకోవడం అర్జున్ అండ్ టీంని అపాయింట్ చేస్తారు. కానీ ఎవరికీ తెలియకుండా అర్జున్ ఓకే ఏజంట్, కానీ అందరికీ తెలిసేలా అంటే.. రామకృష్ణగా ఢిల్లీలో ఒక బ్యాంకు ఉద్యోగిగా కంటిన్యూ అవుతుంటాడు. అక్కడ మెహ్రీన్ తో ప్రేమలో పడతాడు. అప్పుడే తనకి టెర్రరిస్ట్ సోహైల్ ఇబ్రహీం నుంచి అర్జున్ కి ఛాలెంజ్ ఇస్తాడు. దాంతో అర్జున్ టెర్రరిస్ట్ లను పట్టుకోవడం కోసం కరాచీ వెళ్తాడు. ఇండియన్ ఏజంట్ అయిన అర్జున్ కరాచీలో ఎలా టెర్రరిస్ట్ లని పట్టుకున్నాడు? ఆ పట్టుకునే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు.? అక్కడ తనకి ఎవరెవరు హెల్ప్ చేశారు? ఫైనల్ గా అర్జున్ మిషన్ ఏమైంది? అనేదే కథ.

ఆన్ స్క్రీన్ స్టార్స్ పెర్ఫార్మన్స్:

చాణక్య సినిమాలో ఈ ఆర్టిస్ట్ భలే చేసాడు అనేలా చెప్పుకునేలా ఒక్క ఆర్టిస్ట్ నటన కూడా లేదు. కానీ ఎవరు ఎలా చేశారు అనే విషయానికి వస్తే.. గోపీచంద్ యాజిటీజ్ గా ప్రతి సినిమాలో ఎలా చేస్తాడో అలానే చేసాడు. ఇక మెహ్రీన్ కౌర్ వల్ల సినిమాకి ఎలాటి ఉపయోగం లేకపోగా.. గోపీచంద్ – మెహ్రీన్ డాగ్ ట్రాక్ చాలా ఇర్రిటేట్ చేస్తుంది. అలాగే వీరి మధ్య వచ్చే 3 పాటలు సినిమాకి గానీ, గ్లామర్ పరంగానూ ఎలాంటి ఉపయోగం లేదు. జరీన్ ఖాన్ మొదటి తెలుగు సినిమా, తనకి కీ రోల్ ఇచ్చారు తను మాత్రం ఉన్నంతలో బాగా చేసింది. ఇక విలన్స్ గా చేసిన రాజేష్ ఖత్తర్, ఉపేన్ పటేల్ లకి స్ట్రాంగ్ క్యారెక్టర్ లేకపోవడం వల్ల వీళ్ళ పెర్ఫార్మన్స్ కనపడదు. ఇక నాజర్, జయప్రకాష్, ఆదర్శ్ బాలకృష్ణ లాంటి వాళ్ళు జస్ట్ ఓకే.

ఆఫ్ స్క్రీన్ స్టార్స్ టాలెంట్:

ఆఫ్ స్క్రీన్ పరంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఒకే ఒక్కరు ఉన్నారు. అతనే శ్రీ చరణ్ పాకాల. శ్రీ చరణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సీన్స్ లో కంటెంట్ లేని టైం లో కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేయడానికి ట్రై చేసాడు. ఇకపోతే వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ 70% బాగుంది కానీ ఒక 30% చాలా బ్యాడ్ గా అనిపిస్తాయి. ఇకపోతే విశాల్ శేఖర్ అందించిన పాటలు అస్సలు బాలేదు. ఇకపోతే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాలేదు. ఫస్ట్ హాఫ్ అంత సాగదీత ఉన్నా అస్సలు కట్ చేయకుండా ఆయన ఎలా ఉంచాడనేది అర్థం కావట్లేదు. ఇకపోతే ఒక స్పై థ్రిల్లర్ లో ఉండాల్సిన రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా లేవు. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి.

ఇక చాణక్య కెప్టెన్ అయిన తిరు విషయానికి వస్తే.. ఆయన కథని హిందీ సినిమా ‘డీ-డే’, ‘బేబీ’, ‘టైగర్ జిందా హై’ లాంటి మొదలైన సినిమాల సీన్స్ ని, కథలని మిక్సీలో వేసి తీసి ఈ సినిమా కథని రాసాడు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా సేమ్ టు సేమ్ సినిమాలని ఫాలో అయ్యాడు. సరే కథ – స్క్రీన్ ప్లే చాలా మందిలా ఇన్స్పైర్ అయ్యాడు అనుకొని వదిలేసినా, డైరెక్టర్ గా అయినా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాలి కదా.. కానీ ఆ విషయంలో కూడా ఫెయిల్ అవ్వడం వల్ల సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. కనీసం గొప్ప మేధావి అయినా చాణక్య పేరు పెట్టారు, దాన్ని తలపించేలా ట్విస్ట్స్, టర్న్స్ ఉండాలి కానీ అవి కూడా లేకపోవడం ఈ స్పై థ్రిల్లర్ విషయంలో డైరెక్టర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు బాగానే ఖర్చు పెట్టారు, లొకేషన్స్ పరంగా గ్రాండ్ ఉంది కానీ సినిమాకి అంత వర్త్ లేనప్పుడు వాళ్ళు ఇంత పెట్టడం బూడిదలో పోసిన పన్నీరైంది.

సీటీమార్ పాయింట్స్:

 • గోపీచంద్ ఇంట్రడక్షన్ యాక్షన్ బ్లాక్
 • ఇంటర్వల్ ఛాలెంజ్ ఎపిసోడ్
 • సెకండాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్

బోరింగ్ పాయింట్స్:

 • చాలా సార్లు చూసేసిన కథ
 • బోరింగ్ స్క్రీన్ ప్లే
 • గోపీచంద్ – మెహ్రీన్ ట్రాక్
 • చిరాకు తెప్పించే ఫస్ట్ హాఫ్
 • కిక్ లేని యాక్షన్ ఎపిసోడ్స్
 • కథని డ్రైవ్ చేసే ఎమోషన్ లేదు.
 • థ్రిల్ చేయలేని థ్రిల్స్
 • ఇంకా చాలానే ఉన్నాయి, ఇక ఆపేద్దాం..

విశ్లేషణ:

ఈ చిత్ర టీం ‘చాణక్య’ సినిమా పవర్ ప్యాక్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అని చెప్పారు కానీ సినిమా చూసాక ఇందులో పవర్ లేదు, ఆకట్టుకునే యాక్షను లేదు, ఇక థ్రిల్స్ అయితే అసలే లేవు. వీటన్నిటితో పాటు కొస మెరుపుగా గోపీచంద్ కెరీర్లో త్వరగా మర్చిపోవాల్సిన సినిమా ‘చాణక్య’ అని ప్రేక్షకులు అంటున్నారు. ప్రతి ఏడాది కమర్షియల్ సినిమా అనే మూసలో చేసి డిజాస్టర్స్ గా మిగిలే ఎన్నో సినిమాల లిస్టులో ఈ రోజు రిలీజైన చాణక్య’ కూడా చేరుతుంది. ఓవరాల్ గా సినిమా పరంగా చెప్పుకోదగిన సీన్స్ ఒక నాలుగైదు ఉంటాయి.. కేవలం నాలుగైదు సీన్స్ కోసం సినిమాకి వెళ్ళాలా? వద్దా? అన్నది మీకే వదిలేస్తున్నా..

ఫైనల్ పంచ్: చాణక్య – స్కిప్ చేసి దసరాని ఎంజాయ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: బుధవారం 28 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ రా.1:50 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త ఉ.7:33...

నేహా చౌదరి ‘వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ’ ఖాయమైపోయిందా.?

బిగ్ బాస్ రియాల్టీ షో అంతా గజిబిజిగానే కొనసాగుతోంది. ప్రతి సీజన్‌లోనూ పరిస్థితి ఇంతే. కాకపోతే, ఈసారి ఆ గందరగోళం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అసలు హౌస్‌లోకి కంటెస్టెంట్లు ఎందుకు వెళ్ళారు.? అన్నదానిపై...

రాశి ఫలాలు: శుక్రవారం 30 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి రా.10:41 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: విశాఖ ఉ.6:22 వరకు...

మహేష్ బాబుకి తల్లి అంటే అమితమైన ఇష్టంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న...

మొన్న ‘పే సీఎం’, ఇప్పుడేమో ‘భారతి పే’.! వైసీపీలో ‘బులుగు’ కుంపటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ అధినాయకత్వం పట్ల వ్యతిరేకత వుందా.? రెడ్డి సామాజిక వర్గంలో కొందరు, వైసీపీకి ఎదురు తిరుగుతున్నారా.? సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి...
సినిమా రివ్యూ: చాణక్యనటీనటులు: గోపీచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ తదితరులు. ఎడిటర్‌: మార్తాండ్ కె వెంకటేష్ సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి మ్యూజిక్: విశాల్ శేఖర్ దర్శకత్వం: తిరు నిర్మాణం: ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర విడుదల తేదీ: 05 అక్టోబర్ 2019 మాచో హీరో గోపీచంద్ హీరోగా ఇండియన్ రా ఏజంట్ అర్జున్ పాత్రలో నటించిన సినిమా 'చాణక్య'. కంప్లీట్ స్పై థ్రిల్లర్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందిన ఈ సినిమా...