Switch to English

వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు: సిగ్గూ ఎగ్గూ వదిలేసిన రాజకీయం.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతాననీ, అప్పటివరకు అసెంబ్లీకి వచ్చేది లేదని చెబుతూ, రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణించారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తన సతీమణి భువనేశ్వరి, ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదనీ, అలాంటి భువనేశ్వరి మీద అసెంబ్లీలో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు వాపోయారు.

రానురాను రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత దిగజారుడుతనాన్ని సంతరించుకుంటున్నాయి. ‘ఇంతకన్నా పతనం ఇంకేమీ వుండదు..’ అని జనం ముక్కున వేలేసుకుంటున్న ప్రతిసారీ, అంతకన్నా దిగజారుడుతనాన్ని చూపిస్తున్నారు రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు.

తాజాగా చంద్రబాబు విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు.. ఆ దిగజారుడుతనానికే పరాకాష్ట. నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలి. అయితే, చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. ఆయన విషయంలో ‘బూతులు’ మాట్లాడటానికి వైసీపీలో చాలామంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి కంట్రోల్ చేయలేకపోతుండడమంటే, ముఖ్యమంత్రి స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలేమో.

సరే, చంద్రబాబు హయాంలో.. వైసీపీ నేతల మీద అసెంబ్లీలో ఎలా తెలుగు తమ్ముళ్ళు వ్యవహరించారన్నది వేరే చర్చ. ‘టిట్ ఫర్ టాట్’ అనేది రాజకీయాల్లో వాంఛనీయం కాదు. రాజకీయ నాయకులా.? వీధి రౌడీలా.? అని ప్రశ్నించాల్సి వస్తే, ఆ వీధి రౌడీలు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందిప్పుడు రాజకీయ నాయకుల్ని చూసి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

టీడీపీ, వైసీపీ హయాంలో వాళ్ళకి ‘సీఎం కుర్చీ’ సాధ్యమా.?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. తన కుమారుడ్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు అనుకుంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, వైఎస్ జగన్...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పను పెద్దపీట వేస్తున్నాం: సీఎం జగన్

రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌ విధానంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. కోవిడ్ తో రాష్ట్ర...

అతిథి దేవో భవ రివ్యూ: రొటీన్ డ్రామా

హీరోగా పూర్తిగా క్రేజ్ కోల్పోయిన ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవో భవ ఈరోజు ప్రేక్షకుల. పొలిమేర నాగేశ్వర్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈ చిత్రంతోనైనా ఆది సక్సెస్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి రేసులోకి వచ్చేసాయి. ఏకంగా ఎనిమిది సినిమాల...