RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి అదిరిపోయే టైటిల్ సెట్ అయినట్లు సమాచారం. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ ప్రకటన ఉంటుంది. దాంతో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనుంది నిర్మాణ సంస్థ.
ఏదైనా ఆఖరు నిమిషంలో మార్చితే తప్పితే, ఈ ప్రాజెక్ట్ కు సీఈఓ అనేది అధికారిక టైటిల్ గా చెబుతున్నారు. సీఈఓ అంటే చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్. ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి కామన్ టైటిల్ ఉంటే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించనుండగా, మరొక పాత్రలో అధికార యంత్రాంగానికి చెందిన వ్యక్తిగా రామ్ చరణ్ కనిపిస్తారు. ఈ సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే పాత్ర అదని తెలుస్తోంది.
చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత.