ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన పేదలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది. రోజువారీ కూలీలు, పేదలు ఆకలితో చనిపోకుండా చూసే ఉద్దేశంతో గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు.
దేశంలోని 80 కోట్ల మంది పేదలకు నెలకు ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ కు ఇది అదనమని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి కేజీ కందిపప్పు కూడా ఇస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలిని రూ.182 నుంచి రూ.202కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే మూడు నెలలపాటు 20 కోట్ల మంది మహిళల జనధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున జమ చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద 8.69 కోట్ల రైతులకు రూ.2వేల ఆర్థిక సాయాన్ని తక్షణమే వారి ఖాతాల్లో వేయనున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మూడు నెలలపాటు నెలకు ఒక సిలిండర్ ను ఉచితంగా ఇస్తారు. ఇక రూ.15వేల లోపు వేతనం కలిగిన ఉద్యోగుల ఈపీఎఫ్ వాటాను కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. మూడునెలల పాటు 24 శాతం ఈపీఎఫ్ ను కేంద్రమే చెల్లిస్తుంది.
మరోవైపు విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులు, హెల్త్ కేర్, పారామెడికల్, సానిటేషన్ సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తమ్మీద కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో రిలీఫ్ కలుగుతుందా అనే అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించింది బాగానే ఉందని కొందరు అంటుండగా.. సాయం విషయంలో కేంద్రం తెలివిగా వ్యవహరించిందని మరికొందరు విమర్శిస్తున్నారు. రైతులకు అందజేసే రూ.2వేల సాయం కొత్తగా ఇచ్చేది కాదని గుర్తుచేస్తున్నారు.
24316 766986Thank you for your information and respond to you. bad credit auto loans hawaii 985531
987058 970568Outstanding read, I just passed this onto a colleague who was performing slightly research on that. And he truly bought me lunch because I found it for him smile So let me rephrase that. 123041
353971 503186brilliantly insightful post. If only it was as easy to implement some with the solutions as it was to read and nod my head at each of your points 245037