Switch to English

కేంద్రం వెనక్కి.. కాంగ్రెస్ ముందుకు..

వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పని లేకపోవడంతో పస్తులతో అక్కడ ఉండలేక.. రవాణా సౌకర్యం లేకపోవడం సొంతూళ్లకు వెళ్లలేక వాళ్లు నానా యాతనలు పడుతున్నారు. కొంతమంది మూటాముల్లె సర్దుకుని వందల కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు.

ఈ నేపథ్యంలో 40 రోజుల తర్వాత వలస కార్మికుల విషయంలో కేంద్రం స్పందించింది. వారిని స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. తగిన జాగ్రత్తలతో బస్సుల్లో వారిని తరలించాలని సూచించింది. అయితే, దీనిపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అంత దూరం నుంచి బస్సుల్లో వారిని తీసుకురావడం అసాధ్యమని, అందువల్ల ప్రత్యేక రైళ్లలో వారిని స్వస్థలాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నాయి.

ఇందుకు సమ్మతించిన కేంద్రం.. రైళ్లు నడపటానికి నిర్ణయించింది. ఒకటి రెండు రైళ్లు వెళ్లాయో లేదో కేంద్రానికి తత్వం బోధపడింది. తరలించాల్సిన వాళ్లు లక్షల్లో ఉన్నారని అర్థమైంది. వారందరినీ తరలించాలంటే శక్తికి మించిన భారమని భావించిందో ఏమో.. వెంటనే యూ టర్న్ తీసుకుంది. లాక్ డౌన్ ముందు వివిధ రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలించాలంటూ మెలిక పెట్టింది.

ఉపాధి కోసం గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కార్మికులు కొత్త మార్గదర్శకాల ప్రకారం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనర్హులన్నమాట. ఇది కార్మికుల పాలిట ఆశనిపాతమే. పైగా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారి నుంచి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం డబ్బులు వసూలు చేసి తమకు ఇవ్వాలంటూ రైల్వేశాఖ కోరడం విమర్శలకు తావిచ్చింది. సాక్షాత్తు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దీనిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ ముందుకొచ్చింది.

వలస కార్మికులను తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంతో బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీంతో దీంతో రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రంగంలోకి దిగారు. కూలీల తరలింపునకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్రం, 15 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని ప్రకటించారు. ఈ విషయాన్ని సుబ్రమణ్య స్వామే మళ్లీ ట్విట్టర్లో వెల్లడించారు. మరి ఇప్పటికైనా కార్మికులు ఏ సమస్యా లేకుండా తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ప్రభుత్వాలు సరిగా పనిచేస్తాయో లేదో చూడాలి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...