Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరనిలోటని అన్నారు. ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత కల్పించారు. మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిది: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి.. సమాజ హితం కోసమే అనుక్షణం పని చేశారు.. చంద్రబాబునాయుడు
క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన రామోజీ సొంతం. తెలుగు భాషకు ఎనలేని సేవలు చేశారు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. చిరంజీవి
పత్రికా, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు నుడికారానికి, జర్నలిజానికి కొత్త సొబగులు అద్దారు.. బాలకృష్ణ
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు.. ప్రజా పక్షం వహిస్తూ వార్తలు రాసి జన చైతన్యం కలిగించారు.. పవన్ కల్యాణ్
నిను చూడాలని సినిమాతో నన్ను పరిచయం చేశారు.. ఆ మహనీయుడు లేనిలోటు పూడ్చలేనిది.. జూ.ఎన్టీఆర్
మరోవైపు గేమ్ చేంజర్ చిత్రీకరణలో ఉన్న రామ్ చరణ్, దర్శకుడు శంకర్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.