తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన వేసే ప్రతి అడుగు.. చేసే ప్రతి పని అభివృద్ధికి తార్కాణంగా మారుతున్నాయి.
1995 నుంచి 2004 వరకు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. ఆ టైం లోనే విజన్ 2020 అనే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన నిర్ణయాత్మకమైన ఆలోచనలే నేటి తరాలకు ఆదర్శంగా నిలిచాయి. అంతేకాదు ఆయన ఎంత విజనరీ లీడర్ అన్నది భావితరాలకు తెలిసేలా చేశాయి. భావితరాల భవిష్యత్ కోసం.. వారి బంగారు జీవితాల కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనలు కృషి ప్రశంసనీయమని చెప్పొచ్చు.
విజన్ 2020లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ పాటు భవిష్యత్తు అంతా కంప్యూటర్ రంగానిదే అని ముందే ఊహించి 1998లో హైటెక్ టవర్ ని నిర్మించారు. అప్పట్లోనే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందించేలా చేశారు. దాని వల్ల లక్షల మంది ఉద్యోగాలు వచ్చేలా చేశారు చంద్రబాబు.
చంద్రబాబు విజన్ 2020తో హైదరాబాద్ నేడు మరో సింగపూర్ గా మారింది. అప్పట్లో విజన్ 2020 ని వెక్కిరించిన వారే నేడు ఆయన దార్శనికతంకు జేజేలు పలుకుతున్నారు.
ఇప్పుడు మరోసారి స్వర్ణాంద్ర 2047 అంటూ ఆంధ్రప్రదేశ్ ని అప్పటికల్లా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేలా చేయాలని చూస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.
స్వర్ణాంద్ర 2047 విజన్ లో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే ముఖ్య ఉద్దేశంగా చూస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టడానికి నూతన ఆవిష్కరణలు పెంపొందించడానికి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పేదరిక నిర్మాలన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, ఉపాది కల్పన, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ, రైతు వ్యవసాయ సాంకేతికత, శక్తి మరియు ఇంధనాల వ్యవ నియంత్రణ, సమగ్ర విధానాలతో స్వచ్చాంద్ర, సమగ్ర సాంకేతికత లాంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందించారు.