చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గత జగన్ పాలనకు తమ పాలనకు స్పష్టమైన తేడాను చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యక్తిగతంగా తిట్టడానికి పోకుండా.. తమ పనుల ద్వారానే జగన్ కు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్ లో జరుగుతున్న పనులను జగన్ చేసిన పనులతో పోలుస్తూ హుందాగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాన్ని మూడింతలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో అయినా, పల్లెటూరిలో అయినా సెంటున్నర భూమిని మాత్రమే కేటాయించేవారు.
కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దాన్ని మూడింతలు చేసింది. ఈ విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లో 2 సెంట్లకు పెంచేసింది. ఎందుకంటే అంత తక్కువ స్థలంలో ప్రజలు ఉండటానికి కూడా వెసలుబాటు ఉండదు. కాబట్టి దాన్ని త్రిబుల్ చేస్తే ప్రజలు అందులో ఉండేందుకు బాగుంటుందని చంద్రబాబు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టు చేస్తూ జగన్ ను ఏకి పారేస్తున్నారు. జగన్ తన ప్రభుత్వంలో కేవలం చంద్రబాబును వ్యక్తిగతంగా తిడుతూ సెటైర్లు వేయడానికే ఇంట్రెస్ట్ చూపించేవాడని.. కానీ చంద్రబాబు మాత్రం పనులతోనే జగన్ కు సమాధానం చెబుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం మీద ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు ఇదే తేడా అంటూ పోలుస్తున్నారు.