Switch to English

మోడీ, బాబు కలయిక.! వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి బీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఎదురు పడితే కులాసాగా కబుర్లు చెప్పుకోవడం కొత్తేమీ కాదు. రాజకీయంగా ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలు వున్నాగానీ.. తప్పవు.. కాస్సేపు నటించాల్సిందే.! అయినా, నటించాల్సిన అవసరమేముంటుంది.? వ్యక్తిగత వైరాలు రాజకీయ నాయకుల మధ్య ఏముంటాయ్.?

ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకే రాజకీయ నాయకులు రాజ్యమేలుతున్న రోజులివి. నిన్న తిట్టి, నేడు పొగిడి, రేపు మళ్ళీ తిట్టే సంస్కృతి రాజకీయాల్లో బాగా పెరిగిపోయింది. పైగా, రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరని రాజకీయ సూక్తి ఎప్పటినుంచో వుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో కలిశారు. అది కూడా, కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళడం.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ, చంద్రబాబు కరచాలనం, కాస్సేపు ఇద్దరి మధ్యా ‘ప్రత్యేకంగా’ చర్చలు జరగడం.. ఇదంతా తెలిసిన విషయం.

అబ్బే, ఏదో మొహమాటానికి మోడీ, చంద్రబాబుని పలకరిస్తే, దాని మీద అంత ఓవరాక్షనా.? అంటోంది బులుగు మీడియా. ‘మీరు ఢిల్లీకి వస్తుండండి..’ అని మోడీ అన్నారంటూ ‘అతి’ చేస్తోంది పచ్చ మీడియా. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ప్రధాని మోడీ నిరాకరించిన విషయాన్ని విస్మరిస్తే ఎలా.?

అప్పట్లో రాజకీయ వైరం వుండేది. ఇప్పుడది తగ్గింది. ముందు ముందు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతారేమో.! ‘అలా జరగదు’ అని మనం శాసించేయలేం కదా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీడీపీ – బీజేపీ – జనసేన జతకడితే, తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతయిపోతుందని బహుశా వైసీపీ ఆందోళన చెందుతున్నట్టుంది. వైసీపీ కంటే ఎక్కువగా బులుగు మీడియా తెగ భయపడిపోతోంది (ఇంకా కుదరని ఈ కలయిక గురించి తలచుకుంటూనే).!

మొత్తమ్మీద, చంద్రబాబు – నరేంద్ర మోడీ కరచాలనం, కాస్సేపు ముచ్చట్లు.. తెలుగు రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతున్నాయన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....