కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చాలా రకాల పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వాటిని అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు సీఎం అయిన వెంటనే నాలుగు వేల పింఛన్ అమలు చేయడంతో పాటు మెగా డీఎస్సీ మీద సంతకాలు చేశారు. ఇలా వరుసగా ఐదు సంతకాలు చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరో పథకం ప్రవేశ పెట్టడానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు భారీగా నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం.
పర్సనల్ లోన్ ను రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఇస్తున్నారు. ఇక ఒక్కో సంఘానికి రూ.10లక్షల దాకా రుణాలను అందజేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఇప్పుడు స్వచ్ఛ సేవకుల కోసం కూడా త్వరలోనే ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడున్న డ్వాక్రా సంఘాలను మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ గా హోదా కల్పిస్తామని చెప్పారు. దీంతో డ్వాక్రా సంఘాల మహిళలు ప్రస్తుతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన వాటిని కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయడు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. రాబోయే ఏడాది లోపు మిగిలిన వాటిని కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.