ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి.
చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రజలకు తెలిసిందే. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన తన మార్క్ చూపుతూ వచ్చారు. అప్పటి సైబరాబాద్ నుంచి నేడు అమరావతి ప్రజా రాజధానిగా నిర్మించారు. పోలవరం సృష్టికర్తగా అభివృద్ధి ప్రధాతగా నిలిచారు. రాష్ట్రంలో 18 మంది సీ.ఎంలు కలిసి 5 వేల మెగావాట్లు విధ్యుత్ ప్లాంట్లు స్థాపిస్తే.. చంద్రబాబు ఒక్కరే 15 వేల మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్లు స్థాపించారు. నేటు పారిశ్రామిక ప్రగతికి, వ్యవసాయానికి విద్యుత్ ఎంతగా ఉపయోగపడుతుందో తెలిసిందే.
చంద్రబాబు హయాంలోనే రహదారుల నిర్మాణం జరిగింది. సమైక్య రాష్ట్రంలో 51 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరగ్గా.. నవ్యాంధ్రలో 35 కి.మీ రోడ్లు నిర్మించారు. ఉద్యోగ కల్పనలో భాగంగా పెట్టుబడుల ఆకర్షణలో ముందున్నారు. అప్పటి సైబరాబాద్ లో 30 లక్షల ఉద్యోగాలు కల్పించారు. 2014-19 మధ్యలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేశారు. వీటితో పాటు 1.80 లక్షల ఉపాధ్యాయ నియామకాలు చేశారు.
పేదలను సొంత కాళ్లపై నిలబెట్టేలా సంక్షేమ పథకాలను ఇచ్చారు చంద్రబాబు. బీసీలను సొంత కాళ్లపై నిలబడేలా చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య, సివిల్స్ కోచింగ్ ఏర్పాటు చేశారు. భూమి కొనుగోలు పథకం ఇచ్చారు. వ్యాపార, పారిశ్రామిక రాయితీలు ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు.
సామాజిక న్యాయానికి మారు పేరుగా చంద్రబాబు నిలిచారు. మహిళా సాధికారత కోసం విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. డ్వాక్రా వ్యవస్థను దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా చేశారు చంద్రబాబు. ఏజెన్సీల్లో జగన్ గంజాయి పెంచగా.. చంద్రబాబు కాఫీ తోటలు పెంచారు.
ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు బాధితులకు తానున్నా అంటూ నిలబడ్డారు చంద్రబాబు. హుద్ హుద్ టైంలో విశాఖని, సైక్లోన్ లో కోనసీమ, తిట్లీతో శ్రీకాకుళం ఇలా ఆపద ఎలాంటిదైనా ఆ టైంలో చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడ్డారు.