టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు ఇచ్చి రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సూచించడం సంచలనం రేపుతోంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ఢిల్లీలో అరెస్టు కావడంతో.. ఈకేసులో మంత్రి గంగుల కమలాకర్ తోపాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ మంత్రి కమలాకర్ తో టచ్ లో ఉన్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
ఈరోజు ఉదయం మంత్రి కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటివల గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి రావడంతో సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి వెళ్లి.. వచ్చిన వ్యక్తి ఎవరు..? ఏం అడిగారు.. అనే వివరాలపై ఆరా తీసారు. అయితే.. ఆ సమయంలో కమలాకర్ ఇంట్లో లేరు.
మంత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారాల కేసులో ఉపశమనం కల్పించా శ్రీనివాస్ ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో శ్రీనివాస్ విషయంలో కమలాకర్, రవిచంద్ర వివరణ కోరేందుకే నోటీసులు ఇచ్చినట్టు సీబీఐ పేర్కొంది.