అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సోషల్ మీడియా సెలబ్రిటీస్, ఇన్ ఫ్లూయెన్సర్స్ పై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర యాంకర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఈ కేసు విషయమై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఇక లేటెస్ట్ గా మియాపూర్ పోలీసులు సినీ సెలబ్రిటీస్ మీద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానాతో పాటుగా నటుడు ప్రకాష్ రాజ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, అనన్యా నాగళ్ల, ప్రణీత, లక్ష్మి మంచు మీద కేసులు నమోదు చేశారు. వీరితో పాటుగా 18 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద కేసులు పెట్టారు.
వారిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, శోభా శెట్టి, వాసంతి, నేహా, పండు, అమృత పావని, శ్యామల, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, విష్ణు ప్రియ, ఇమ్రాన్ ఖాన్, రఘు, సుప్రీత ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాల బలికి కారణమవుతున్న వీరిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విచారణ అనంతరం వీరిలో ఎవరు ఎలాంటి యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాటి నుంచి ఎవరు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారు అన్నది వెల్లడించే అవకాశం ఉంది.