Switch to English

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,203FansLike
57,764FollowersFollow

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్ ప్లాట్‌ఫార్మ్ కాన్వా ఉన్నతాధికారులతో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ & పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్‌మాట్‌లతో లోకేష్ విస్తృతంగా చర్చలు జరిపారు.

లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.65 వేల కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులలో యువతకు శిక్షణ, సృజనాత్మక నైపుణ్యాలు అందించేందుకు కాన్వా, Creative Land Asia వంటి సంస్థలు భాగస్వామ్యం చేస్తే గొప్ప ప్రయోజనం ఉంటుందని సూచించారు. రాష్ట్ర యువతను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.

కాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియో మాట్లాడుతూ, సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో సేవలు అందిస్తున్నదని తెలిపారు. బీజింగ్, మనీలా, ఆస్టిన్ వంటి నగరాల్లో కార్యాలయాలు ఉండటంతో పాటు, విస్తృతమైన గ్లోబల్ రిమోట్ వర్క్ ఫోర్స్‌తో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, డాక్యుమెంట్లు, పోస్టర్లు, వీడియోల రూపకల్పనను అత్యంత సులభతరం చేసే క్లౌడ్ ఆధారిత డిజైన్ టూల్స్‌ను కాన్వా అందిస్తున్నదని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పరిశీలించి, తగిన నిర్ణయం త్వరలో వెల్లడిస్తామని గిగిలియో హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాన్వా మార్కెట్ క్యాపిటలైజేషన్ $40 బిలియన్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం $2.5 బిలియన్ల ఆదాయం నమోదు చేసిన విషయం వెల్లడించారు.

సినిమా

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

రాజకీయం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

ఎక్కువ చదివినవి

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా, ఆయా హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...