ఒకానొక టైంలో వరుసగా డజను పైగా ప్లాప్స్ చూసిన నందమూరి బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్య సరైన హిట్ లేక అదే పరిస్థితిలో ఉన్నాడు. దాంతో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా ఓకే చేసేయి పట్టాలు కూడా ఎక్కించేసాడు. పక్కాగా హిట్ కొట్టాలని బోయపాటి కూడా తొందర పడకుండా పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు.
ఈ టైములో పలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్ గా షూట్ మొదలు పెట్టి ఒక షెడ్యూల్ చేశారు. అంతే లాక్ డౌన్ వచ్చేసి షూటింగ్స్ కి చెక్ పెట్టేసింది. ఇది పక్కనపెడితే ఈ చిత్ర టీం షూటింగ్ అయితే స్టార్ చేసింది కానీ కొన్ని విషయాలు ఇప్పటికీ ఫైనలైజ్ చేయలేక ఇబ్బందులు పడుతోంది. అవే బాలయ్య సరసన కనిపించబోయే హీరోయిన్స్ అండ్ బాలయ్యతో ఢీ కొట్టే విలన్స్.
ఇటీవల అంజలిని ఒక హీరోయిన్ గా ఫైనల్ చేసాం, మరో హీరోయిన్ కోసం చూస్తున్నామని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదని డైరెక్టర్ బోయపాటి శ్రీనుని స్వయంగా చెప్పాడు. అలాగే మెయిన్ విలన్స్ ఇద్దరు ఉంటారు. అందులో ఒకరిగా శ్రీకాంత్ ని ఫైనల్ చేయగా.. రెండవ విలన్ కోసం ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. లాక్ డౌన్ చివరి దశకు వస్తోంది, జూన్ లేదా జులై నుంచి షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ టైంకి అయినా బోయపాటి ఇవన్నీ ఫైనల్ చేసి చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తాడేమో చూడాలి. బాలయ్య మునుపెన్నడూ చేయని ఓ అఘోరా పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి మిర్యాల రవీందర్ డైరెక్టర్.
610350 637243You produced some decent points there. I looked on the net to the problem and discovered most people goes together with along along with your internet site. 253346
381055 741520If you happen to significant fortunate men and women forms, referring by natural indicates, additionally you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 67002