గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటూ నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలు చేస్తూ వస్తున్నాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా అల్లు కాంపౌండ్ లోకి ఎంటర్ అయిన వాసు.. బన్నీ వాసుగా మారాడంటే అతని ప్రయాణం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అల్లు అరవింద్ కూడా బన్నీ వాసుని సొంత మనిషిలానే ట్రీట్ చేస్తూ వచ్చారు. అందుకే గీతా ఆర్ట్స్ 2 లో నిర్మించే సినిమాలకు బన్నీ వాసునే నిర్మాతగా వ్యవహరిస్తాడు.
కథల విషయంలో ఫైనల్ నిర్ణయం అల్లు అరవింద్ గారిదే అయినా తనకు నచ్చిన కథల విషయంలో మాత్రం అరవింద్ గారి దగ్గర గట్టిగా వాయిస్ వినిపిస్తా అంటున్నాడు బన్నీ వాసు. ఇక లేటెస్ట్ గా నాగ చైతన్యతో తండేల్ సినిమా నిర్మించిన బన్నీ వాసు ఆ సినిమా ప్రమోషన్స్ లో తను పనిచేయాలని అనుకుంటున్న డ్రీమ్ హీరోల గురించి చెప్పుకొచ్చాడు.
బన్నీ వాసు డ్రీమ్ హీరోల లిస్ట్ లో మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందని చెప్పాడు బన్నీ వాసు. ఇక థర్డ్ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో కూడా సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బన్నీ వాసు ప్లానింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉందనిపిస్తుంది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన తండేల్ సినిమాపై బన్నీ వాసు అండ్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఏం చేస్తుంది అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.