Bunny Vas: మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలున్నాయా..? అనే ప్రశ్నకు GA2 నిర్మాణ సంస్థ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) స్పందించారు. చిరంజీవిగారు ఎప్పుడూ కుటుంబమంతా కలిసుండాలనే కోరుకుంటారని చెప్పుకొచ్చారు. ‘ఆయ్’ థీమ్ సాంగ్ లాంచ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..
‘కుటుంబంలో ఒకరు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలతో కొన్ని పరిస్థితులు వస్తాయి. కుటుంబమంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని మెగా ఫ్యామిలీకి ఆపాదించడం సరైంది కాదనుకుంటున్నా. చిరంజీవిగారు ఎప్పుడూ కుటుంబమంతా కలిసుండాలని కోరుకుంటారు. ఏటా కుటుంబమంతటినీ సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు. ఓ సెలబ్రేషన్‌లా చేస్తారు. దాదాపు అందరూ వెళతారు. కుటుంబమంతా కలిసున్నామనే మేసేజ్ ఇస్తారు.
20ఏళ్లుగా వాళ్ల అనుబంధాన్ని చూస్తున్నా. వాళ్ల బాండింగ్ నాకు తెలుసు. వాళ్లలో ఎవరికే సిట్యుయేషన్ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. ఒక్క సందర్భం చాలు.. రూమర్స్ కు చెక్ పెట్టడానికి. నేనూ ఎదురు చూస్తున్నా. మేమంతా కోరుకునేది ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్’ అని అన్నారు