మొత్తానికి అల్లు అర్జున్ మరో సినిమాకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ గత నెల 24నుండి హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు బన్నీ – అటు సుకుమార్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ బన్నీ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ఆర్య తో అల్లు అర్జున్ ని స్టార్ గా నిలబెట్టిన సుకుమార్ ఆ తరువాత ఆర్య 2 తీసాడు అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు .. దాంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చింది. మరి హ్యాట్రిక్ సినిమా కాబట్టి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పేది ఏముంటుంది.
స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 11 న ప్రారంబిస్తారట. ఇక రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడన్నది ఆ రోజు తెలియచేస్తారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం పై పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి హీరోయిన్ గా ఎవరు ఓకే అవుతారన్నది తెలియాల్సి ఉంది. రంగస్థలం సినిమా తరువాత దాదాపు ఏడాది గ్యాప్ లో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమిదే. నిజానికి సుకుమార్ ఈ సినిమాకంటే ముందు మహేష్ తో ప్లాన్ చేసాడు. మహేష్ కి కథ కూడా చెప్పాడు కానీ ఆ కథ కాదు ముందు పూర్తీ స్థాయి ఎంటర్ టైన్మెంట్ సినిమా చేయాలనీ ఉందని మహేష్ చెప్పడంతో సుక్కు ఆ కథను అల్లు అర్జున్ కి వినిపించాడట . కథ విన్న బన్నీ ఓకే చెప్పడంతో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.
సుకుమార్ తెరకెక్కించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్రివిక్రమ్ సినిమా అయ్యాకే అంటే బహుశా జులై లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం గురించి నిజ నిజాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కించే ఈ సినిమా ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ గా ఉంటుందన్నా వార్తలు వస్తున్నాయి.