Switch to English

క్రైమ్ న్యూస్: దారుణం: 14ఏళ్ళ బాలికని పెట్రోల్ పోసి తగలబెట్టారు

08.00 P.M: దారుణం: 14ఏళ్ళ బాలికని పెట్రోల్ పోసి తగలబెట్టారు

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువెన్నాయినల్లూర్ కి సమీపంలోని సిరుమదురై గ్రామంలో తండ్రి జయపాల్ తో కలిసి నివసిస్తోంది 14 ఏళ్ళ జయశ్రీ. ఇంటికి దగ్గరలోనే జయబాల్ ఒక షాప్ ఉంది. సోమవారం తెల్లవారు జామునే ఏఐఏడిఎంకె పార్టీకి చెందిన జి.మురుగన్ జయబాల్ ఇంటికి వచ్చి షాప్ తెరవమని చెప్పాడు. కానీ ఆ సమయంలో తండ్రి ఇంటిలో లేకపోవడంతో జయశ్రీ నేను షాప్ తెరవలేనని చెప్పింది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన మురుగన్ తన సన్నిహితుడు కె.కలియపెరుమాళ్ తో కలిసి మళ్ళీ గంట సేపటి తర్వాత వచ్చి, జయశ్రీని బలవంతంగా తాళ్లతో కట్టేసి, తనపై పెట్రోల్ పోసి తగలబెట్టారని జయశ్రీ మరణ వాంగ్మూలంలో తెలిపింది.

జయశ్రీ కాలిపోతుండడంతో ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టు పక్కల వారు వెంటనే మంటలు ఆర్పీ వెంటనే దగ్గరలోని విల్లుపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. షాప్ తెరవడమొక్కటే రీజన్ కాదని జయబాల్ అండ్ మురుగన్ ఫ్యామిలీ లో పాత కుటుంబ గొడవలు కూడా ఉన్నాయని పోలీసు విచారణలో తేలింది. విల్లపురం స్ప్ జయకుమార్ ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి అన్ని విధాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

03.30 P.M: కోవిడ్‌ 19 : చైనాలో పరిస్థితి మళ్లీ మొదటికి

చైనా.. కరోనా.. ‘విలయం’ వెనుక ఇంత దారుణమా.!

కరోనాకు పుట్టినిల్లు ఏంటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఠక్కున చెప్పేది చైనా పేరు. పుట్టించారో, పుట్టిందో తెలియదు కాని కరోనా చైనాలో ఆరంభం అయ్యిందని మాత్రం నిజం. కరోనా వైరస్‌ వల్ల మొదటగా నష్టపోయింది చైనా. అయితే చైనా ఆ నష్టంను చాలా తక్కువ మోతాదుతోనే బయట పడినది. మృతుల సంఖ్యతో పాటు పాజిటివ్‌ల సంఖ్య కూడా తక్కువే అని చెప్పాలి. ఇతర దేశాల్లో ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులతో పోల్చితే చైనా చాలా బెటర్‌ అనుకోవచ్చు.

చైనాలో కరోనా కేసుల సంఖ్య జీరో అనుకుంటున్న సమయంలో స్కూల్స్‌, వ్యాపార సంస్థలు మళ్లీ ప్రారంభం అయిన సమయంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో అక్కడ కొత్తగా దాదాపుగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేయడంతో పాటు ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్న కారణంగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈసారి అక్కడ కరోనా విజృంభిస్తే పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందంటున్నారు.

01.30 P.M: మదర్స్‌ డే రోజున తల్లిదండ్రులను చంపిన టెక్కీ

క్రైమ్ స్టోరీస్: నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా 45 రోజుల పాటు వైన్‌ షాప్స్‌ మూసి ఉన్నాయి. దాంతో దేశంలో కేసులు దాదాపుగా 90 శాతం వరకు తగ్గాయి అంటూ పోలీసులు స్వయంగా చెప్పారు. ఎప్పుడైతే వైన్స్‌ ఓపెన్‌ అయ్యిందో అప్పటి నుండి మళ్లీ రచ్చ ప్రారంభం అయ్యింది. తాజాగా బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి తాగిన మత్తులో తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రోజూ తాగుతున్నావంటూ మందలించడంతో కన్న తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చంపేశాడు అంటున్నారు స్థానికులు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆర్బీఐ మాజీ ఉద్యోగి అయిన గోవిందప్ప మరియు ఆయన భార్య శాంతమ్మ దంపతులకు నవీన్‌ తనయుడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత రెండు నెలలుగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న నవీన్‌ ఇటీవల మద్యం షాపులు ఓపెన్‌ చేయడంతో కంటిన్యూగా మద్యం తాగుతున్నాడు. దాంతో అమ్మా నాన్న అతడిని మందలించారు. ఆ కోపంతో రగిలి పోయిన నవీన్‌ వారిని చంపేశారు.

మదర్స్‌ డే అయిన నిన్న రాత్రి నవీన్‌ తన తల్లితో పాటు తండ్రిని కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడంటూ పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. అయితే నవీన్‌ మాత్రం తాను అమ్మానాన్నలను చంపలేదు అంటున్నారు. పోలీసులు తాగిన మైకంలో నవీన్‌ హత్య చేసినట్లుగా ప్రాధమిక నిర్థారనకు వచ్చారు.

12.00 P.M: నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

బీహార్‌లో దారుణం జరిగింది. దంర్బంగా జిల్లాలోని ఒక మారు మూల గ్రామంకు చెందిన 16 ఏళ్ల బాలిక ఏప్రిల్‌ 24వ తారీకున రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు ఆమెను ఫాలో అయ్యారు. నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఆమె నోరు మూసి కొద్ది దూరం లాక్కు పోయారు. అక్కడ వారికి మరో ముగ్గురు కలిశారు. మొత్తం అయిదుగురు కలిసి ఆమెను ఊరు బయట ఉన్న మామిడి తోటలోకి లాక్కు వెళ్లారు.

అత్యంత పాశవికంగా ఒకరి తర్వాత ఒకరు అయిదుగురు ఆమెపై అఘాయిత్యంకు పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించారు. కాని బాలిక ఈ సంఘటన ఎవరికి చెప్పను దయచేసి చంపొద్దంటూ ప్రాదేయ పడటంతో వదిలి పెట్టారు. ఈ విషయం బయటకు చెప్పే కుటుంబంలో అందరిని చంపేస్తామంటూ హెచ్చరించడంతో ఆ బాలిక విషయాన్ని తల్లికి కుటుంబ సభ్యులకు చెప్పలేదు.

ఇటీవల ఆ అయిదుగురులో ఒకడు ఆ సమయంలో తీసిన ఫొటోలు స్నేహితులతో షేర్‌ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాధిత బాలిక తండ్రి కూలి పని కోసం గుజరాత్‌లో ఉంటున్నాడు. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు అయిదుగురిలో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

నిమ్మగడ్డ ఎందుకు తగ్గినట్టు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

దూరదర్శిన్‌ ఉద్యోగికి కరోనా.. దిల్లీ స్టూడియో క్లోజ్‌.!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దిల్లీలోని దూరదర్శిన్‌ కేంద్రంలో జాబ్‌...

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...