ఈనెల 31 నుంచీ ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్ లో 3గంటలపాటు జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో ఈమేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
‘ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలకు కేంద్రం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రతి బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. రైతుల విషయంలో వివక్ష.. ఆర్ధిక అంశాలపై ఆంక్షలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, కార్పొరేట్లకు లాభం.. నష్టాల భారాన్ని ప్రజల మీదకు రుద్దుతున్న అంశాలపై నిరసన తెలియజేయాలి’.
‘రాష్ట్రంపట్ల ప్రదర్శిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగట్టాలి. విభజన హామీలు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలి. అభివృద్ధిని అడ్డుకుంటున్న గవర్నర్ల తీరును ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై బీజేపీ తీరుపై సుదీర్ఘ చర్చ జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేయాలి’ అని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు.
885854 774772Aw, i thought this was quite a great post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce an excellent article but exactly what do I say I procrastinate alot by no indicates manage to get something done. 612883