మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల నూతన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్య స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈతరం యువకులు కుర్రాళ్లు ఎంత సెన్సిటివ్ గా తయారు అయ్యారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. అతడు పెళ్లి అయ్యి కేవలం ఆరు నెలల్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపర్చడంతో పాటు కుటుంబ సభ్యులకు శోఖం మిగిల్చాడు.
భార్య చెప్పిన మాట వినడం లేదు అంటూ అతడు సూసైడ్ నోట్ లో రాసిన కారణం అందరికి కూడా సిల్లీగానే అనిపిస్తుంది. తన భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని.. తాను చెప్పినట్లుగా చీర కట్టుకోక పోవడంతో బయట సమాజంలో అవమానంగా భావించి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఈ నవ వరుడు లేఖ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
178057 774691A thoughtful opinion and guidelines Ill use on my internet page. Youve certainly spent some time on this. Properly carried out! 31010