Bridegroom: ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా పెళ్లి తంతులో ఏదో ఒక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్ లోను అలాంటి ఘటన ఒకటి జరిగింది. తాగిన మైకంలో ఏకంగా తన పెళ్లి నే మర్చిపోయాడు వరుడు. ఫలితంగా పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చాడు.
వివరాలకు వెళ్తే.. భాగల్పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కి మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది. తనకు, తన స్నేహితులకు ప్రత్యేక గది కేటాయించాలని మద్యం తెప్పించాలని పెళ్లికూతురు తరపు బంధువులను డిమాండ్ చేశాడు. చేసేదేం లేక వారు వరుడి డిమాండ్ ను తీర్చారు.
అయితే ఫుల్ గా తాగిన వరుడు పెళ్లి మండపానికి వెళ్లడం మర్చిపోయాడు. మత్తు దిగగానే ఆలస్యంగా మండపానికి వెళ్ళాడు. దీంతో మనస్తాపం చెందిన పెళ్లికూతురు వివాహాన్ని రద్దు చేసుకుంది. ఈ పెళ్లి తంతుకు ఖర్చుపెట్టిన డబ్బును మొత్తం చెల్లించాలంటూ వధువు కుటుంబ సభ్యులు పెళ్ళికొడుకుని డిమాండ్ చేశారు.